Jaggery And Coriander Powder Laddu Benefits: తెలుగు రాష్ట్ర ప్రజలు బెల్లాన్ని వివిధ రకాల ఆహారాల్లో వినియోగిస్తారు. కొంతమంది అయితే స్వీట్లలో చక్కెరకు బదులుగా బెల్లాన్ని వాడుతూ ఉంటారు. మార్కెట్లో బెల్లం రకరకాలుగా లభిస్తోంది. చక్కెరకు బదులుగా బెల్లాన్ని వినియోగించడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో దాగి ఉన్న ఔషధ గుణాలు దీర్ఘకాలిక వ్యాధులను సైతం తగ్గిస్తాయట. తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు దీనిని ప్రతిరోజు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారని ఆరోగ్య రెండు నెలలు చెబుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బెల్లంలో ధనియాలు కలుపుకొని తినడం వలన బోలెడు లాభాలు కలుగుతాయని ఆయుర్వేదన నిపుణులు చెబుతున్నారు. కీళ్ల నొప్పులు మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్న వారు ప్రతిరోజు ఇలా బెల్లంలో ధనియాలు కలుపుకొని తీసుకోవడం వల్ల శాశ్వతంగా వీటి నుంచి ఉపశమనం పొందవచ్చని వారు అంటున్నారు. అంతేగాకుండా ఈ బెల్లం ధనియాల్లో దాగి ఉన్న ఔషధ గుణాలు ఇతర అనారోగ్య సమస్యల నుంచి కూడా సులభంగా ఉపవాసం కలిగిస్తాయి. ప్రస్తుతం చాలామందిలో ఎముకల సమస్యలు వస్తున్నాయి. అయితే చిన్న వయసులోనే ఎముకలు అరిగిపోయి.. దృఢత్వాన్ని కోల్పోతున్నాయి. ఇలాంటి వారికి కూడా ఈ బెల్లం తో కూడిన ధనియాలు ప్రభావంతంగా పనిచేస్తాయి.


ఇది కూడా చదవండి : Kamareddy Politics: కామారెడ్డి రాజకీయాల్లో పొలిటికల్ టెన్షన్.. కేసీఆర్ ప్రత్యర్థులు అటెన్షన్


అంతేగాకుండా బెల్లం ధనియాలు ప్రతిరోజు తీసుకునే వారిలో చిగుళ్ల సమస్యలతో పాటు నోటి దుర్వాసన, చిగుళ్ల నుంచి రక్తం కారటం వంటి సమస్యలు కూడా దూరం అవుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే ఔషధ గుణాలు శరీరంలోని రోగనిరోధక శక్తిని కూడా పెంచేందుకు సహాయపడతాయి. దీంతోపాటు సీజనల్ వ్యాధులు రాకుండా కూడా ఉంటాయి. రోజు ఇలా బెల్లం ధనియాలను కలిపి తినడం వల్ల రక్తం కూడా శుద్ధి అవుతుంది. దీంతోపాటు హార్మోన్ల సమస్యలు, శ్వాస సంబంధిత సమస్యలు కూడా సులభంగా తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. కాబట్టి తరచుగా ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ట్రై చేసి చూడండి.


ఆధునిక జీవనశైలి కారణంగా ప్రస్తుతం చాలామంది జీర్ణ క్రియ సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం వల్ల చిన్న పెద్ద తేడా లేకుండా మలబద్ధకం సమస్య బారిన పడుతున్నారు దీని కారణంగా తీవ్ర పొట్ట సమస్యలకు గురవుతున్నారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఇలాంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందడానికి బెల్లం, ధనియాలు ప్రభావంతంగా సహాయపడతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో ఉండే మూలకాలు మలబద్దక సమస్యను తగ్గించడమే కాకుండా తీవ్ర పొట్ట సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. రక్తపోటు, రక్తహీనత సమస్యలతో బాధపడుతున్న వారు ఈ బెల్లం ధనియాలు ప్రతిరోజు తినడం వల్ల కూడా వీటి నుంచి ఉపశమనం పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. 


ఇది కూడా చదవండి : Kamareddy Politics: కామారెడ్డి రాజకీయాల్లో పొలిటికల్ టెన్షన్.. కేసీఆర్ ప్రత్యర్థులు అటెన్షన్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి