Kamareddy Politics: కామారెడ్డి రాజకీయాల్లో పొలిటికల్ టెన్షన్.. కేసీఆర్ ప్రత్యర్థులు అటెన్షన్

KCR vs Shabbir Ali vs Venkataramana Reddy: కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్నట్లు ప్రకటించడంతో ఒక్కసారిగా కామారెడ్డి అసెంబ్లీ ముఖ చిత్రం మారిపోయింది. ఏకంగా సీఎం కేసీఅర్ ఇక్కడి నుండి పోటీకి రావడంతో బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో నూతనోత్తేజం రాగా కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీల్లో మాత్రం నైరాశ్యం మొదలైంది. మొత్తానికి కామారెడ్డిలో రాజకీయం వేడెక్కింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 27, 2023, 08:07 AM IST
Kamareddy Politics: కామారెడ్డి రాజకీయాల్లో పొలిటికల్ టెన్షన్.. కేసీఆర్ ప్రత్యర్థులు అటెన్షన్

KCR vs Shabbir Ali vs Venkataramana Reddy: కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్నట్లు ప్రకటించడంతో ఒక్కసారిగా కామారెడ్డి అసెంబ్లీ ముఖ చిత్రం మారిపోయింది. ఏకంగా సీఎం కేసీఅర్ ఇక్కడి నుండి పోటీకి రావడంతో బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో నూతనోత్తేజం రాగా కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీల్లో మాత్రం నైరాశ్యం మొదలైంది. మొత్తానికి కామారెడ్డిలో రాజకీయం వేడెక్కింది. కేసీఆర్ ను స్వాగతిస్తూ బీఆర్ఎస్ పార్టీ వర్గాలు గెలుపు ధీమా భరోసాతో ఉండగా కాంగ్రెస్, బిజెపి పార్టీలు డైలామాలో పడి ఎలాగైనా కేసీఆర్ ను ఒడిస్తామన్న సవాల్ విసురుతు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఇందుకు తమ బలాబలాలపై అంచనాలు వేసుకుంటున్నాయి.

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ గజ్వేల్‌ నియోజకవర్గంతో పాటు కామారెడ్డి నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్లు ఈ నెల 19న బి.ఆర్.ఎస్ పార్టీ మొదటి విడత అభ్యర్థుల జాబితాలోనే తన పేర్లను ప్రకటించుకున్నారు. కామారెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పేరును పక్కన పెట్టి స్వయంగా సిఎం కేసీఆర్ పోటీలోకి రావడం వెనుక పెద్ద వ్యూహమే దాగి ఉంది. నిజామాబాద్, మెదక్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల పరిధిలోని 33 అసెంబ్లీ , 4 పార్లమెంట్ స్థానాలపై ప్రభావం చూపుతుందని భావించిన సీఎం కేసీఆర్‌ కామారెడ్డి నుంచి పోటీ చేయడానికి ముందుకువస్తున్నట్లు తెలుస్తోంది. నల్లగొండ, ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలలో బీఆర్ఎస్‌ పార్టీకి పరిస్థితులు అనుకూలంగా లేవని వచ్చిన సర్వే నివేదికలతో ఆలోటును భర్తీ చేయడానికే కేసీఆర్‌ సరికొత్త ఎన్నికల వ్యూహాలకు పదును పెట్టారని తెలుస్తోంది. కామారెడ్డిలో పోటీ వ్యూహం కాంగ్రెస్, బిజెపి రెండు ప్రత్యర్థి పార్టీలకు చెక్ పెట్టినట్టయింది.

సీఎం కేసీఆర్‌ పూర్వీకుల స్వగ్రామం కామారెడ్డి అసెంబ్లీ నియోజక వర్గం దోమకొండ మండలం పోసానిపల్లే. ప్రస్తుతం దీనినే కొనాపూర్ అని కూడా పిలుస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మానేరు డ్యాం నిర్మాణంతో సొంతూరు ముంపునకు గురవ్వగా, కేసీఆర్‌ కుటుంబం ఆనాడు సిద్దిపేట జిల్లా చింతమడక గ్రామానికి వలస వచ్చింది. ఈ విషయాన్నే కేటీఆర్ కామారెడ్డి పర్యటనలో స్వయంగా వెల్లడించారు. సీఎం కేసీఆర్‌ ఇక్కడి నుంచే పోటీ చేయడానికి ఇదే ప్రధాన కారణం అంటున్నారు. ఇక్కడ పోటీ చేస్తే కేసీఆర్‌కు సొంతూరు సెంటిమెంట్‌ కలిసి వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు.

ఒకేసారి ఎన్నికలు వస్తే…
పార్లమెంట్‌ కు, అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు జరిగితే సీఎం కేసీఆర్‌ కామారెడ్డి అసెంబ్లీ తో పాటు మెదక్ పార్లమెంటుకూ పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలలో జరుగుతున్న పరిణామాలకు అనుగుణంగా బీఆర్ఎస్‌ పార్టీ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఉమ్మడి మెదక్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల బీజేపీ, కాంగ్రెస్ చోటామోటా లీడర్లతో పాటు నియోజక వర్గ, జిల్లా లీడర్లతో మాట్లాడేందుకు మంత్రి హరీశ్‌ రావు, కేటీఆర్ లకు సీఎం కేసీఆర్‌ బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం.

ఇదిలా ఉండగా హిందూత్వ ఓట్లతో పాటు స్థానిక సమస్యలపై ముఖ్యంగా కామారెడ్డి మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా రాష్ట్ర స్థాయి ఉద్యమాన్ని నిర్మించి సిట్టింగ్ ఎమ్మెల్యే పై వ్యతిరేకతను కుడగట్టడంలో బిజెపి ఒక రకంగా ప్రజల మద్దతును కూడగట్టుకుందని చెప్పవచ్చు. మొత్తానికి కామారెడ్డి అసెంబ్లీ సీటు ఇక తమదేనన్న ధీమాతో బీజేపీ ఉండగా సిఎం కేసీఆర్ రాకతో ఆ పార్టీలో కలవరం మొదలైంది. కేసిఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేయడం వెనుక 25 వేల ఎకరాల అసైన్డ్ భూములను కాజేయడానికి వస్తున్నారని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. గజ్వేల్ లో భూములు మింగింది చాలదన్నట్టుగా ఇప్పుడు కామారెడ్డిలో ప్రభుత్వ భూములు, ఆర్టీసీ భూములపై కన్నేశారని బిజెపి ఆశావహ అభ్యర్థి కాటిపల్లి వెంకట రమణా రెడ్డి ఆరోపిస్తున్నారు. 

గత అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా మూడు సార్లు గంప గోవర్ధన్ చేతిలో ఓడిపోయిన షబ్బీర్ అలీ ప్రస్తుతం కామారెడ్డి ఓటర్ల సానుభూతిని కూడగట్టుకుని ముందుకు సాగుతున్నారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ సీటు తనదేనన్న ధీమాతో ఉండగా కేసీఅర్ రాక ఆయనకు శాపంగా మారుతోంది. ఎలాగైనా కేసీఅర్ ను ఓడించి తాను గెలుస్తానని అవసరమైతే జైలుకు పంపిస్తామని పిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ ఆశావహ అభ్యర్థి షబ్బీర్ అలీ అంటున్నారు.

ఇది కూడా చదవండి : Kamareddy MLA Election: కామారెడ్డిలో కేసిఆర్‌ ఇక గెలిచినట్టేనా ?

మొత్తానికి రసవత్తరంగా మారిన కామారెడ్డి రాజకీయం సిఎం పోటీతో రాష్ట్రంలోనే చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల షెడ్యూల్ రాకముందే కామారెడ్డిలో ప్రత్యర్థి పార్టీల బలాబలాల ప్రదర్శనతో కేసీఅర్ తో పోటీకి సై అంటూ సవాల్ చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో మరింత ఆసక్తిగా మారనున్న కామారెడ్డి సెగ్మెంట్ రాజకీయంపై ఎన్నికల షెడ్యూల్డ్ వరకు వేచి చూడాల్సిందే మరీ..!

ఇది కూడా చదవండి : Shabbir Ali Allegations on KCR: పేదల భూములు లాక్కుని కేసీఆర్ బంధువుల పేరిట మార్పిడి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News