Health tips: గుడ్డుతో పాటు ఈ ఆహారపదార్థాలు కలిపి తింటే.. ఇక అంతేనట!
Foods to avoid with eggs: మనం తీసుకునే ఆహారం మంచిదైతే మన ఆరోగ్యం బాగుంటుంది. ఎందుకంటే మనం తీసుకునే ఆహారం నేరుగా మన ఆరోగ్యం, శరీరంపైనే ప్రభావం చూపిస్తుంది కనుక. ఆహారం అలవాట్లలో మనకు తెలిసో, తెలియకో ఏమైనా పొరపాటు చేసినట్టయితే.. దానికి తగిన మూల్యం కూడా చెల్లించుకోక తప్పదు. కొన్ని రకాలు ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ (Side effects) కూడా అలాంటివే.
Foods to avoid with eggs: మనం తీసుకునే ఆహారం మంచిదైతే మన ఆరోగ్యం బాగుంటుంది. ఎందుకంటే మనం తీసుకునే ఆహారం నేరుగా మన ఆరోగ్యం, శరీరంపైనే ప్రభావం చూపిస్తుంది కనుక. ఆహారం అలవాట్లలో మనకు తెలిసో, తెలియకో ఏమైనా పొరపాటు చేసినట్టయితే.. దానికి తగిన మూల్యం కూడా చెల్లించుకోక తప్పదు. కొన్ని రకాలు ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ (Side effects) కూడా అలాంటివే.
ప్రొటీన్స్, విటమిన్స్, మినెరల్స్ లాంటి ఎన్నో పోషక విలువలు ఉన్న కోడి గుడ్డు కూడా తీసుకోవాల్సిన పద్ధతిలో తినకపోతే.. ఆరోగ్యానికి ప్రమాదమే. అందుకే కోడి గుడ్డును కొన్ని రకాల ఫుడ్స్‌తో కలిపి తినకూడదు అని మన పెద్దలు చెబుతూనే ఉంటారు. ఇంతకీ కోడి గుడ్డుతో తినకూడని ఆ కాంబినేషన్స్ ఫుడ్స్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
Things you should not mix with Eggs - గుడ్డుతో కలిపి తినకూడని ఆహారపదార్థాలు ఏంటంటే..
Sugar with eggs - కోడి గుడ్డు, పంచదార: కోడి గుడ్డు, పంచదారలో ఉండే అమినో యాసిడ్స్ ఒకేసారి విడుదలై అవి శరీరంలో విషపూరితమైన రసాయనాలుగా మారుతాయి. ఫలితంగా శరీరంలో రక్తం గడ్డకట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది.
Also read : మీకు టీతో పాటు బిస్కట్ తినే అలవాటుందా..అయితే వెంటనే మానేయండి మరి
Soy milk with eggs - సోయ మిల్క్, కోడి గుడ్డు కాంబినేషన్: సోయ మిల్క్, కోడి గుడ్డు కలిపిన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల శరీరం ప్రోటీన్స్‌ని గ్రహించే శక్తిని కోల్పోతుంది. అందుకే ఈ తరహా ఆహారపదార్థాలను కలిపి తీసుకోవడం మానేయాలి.
Tea with eggs - ఛాయ, కోడి గుడ్డు : ఛాయ, కోడి గుడ్డుతో చేసిన ఆహారపదార్థాలను తినడం వల్ల మల బద్ధకం సమస్య తలెత్తుతుంది. ఆరోగ్యానికి హాని కలిగే ప్రమాదం సైతం ఉంది.
Also read : Home remedies for pimples: మొటిమలతో ఇబ్బంది పడుతున్నారా..ఈ టిప్స్ పాటించండి చాలు
Banana with eggs - అరటి పండ్లు, కోడి గుడ్డు: కొంత మంది క్రీడాకారులు, వ్యాయమం చేసే అలవాటు ఉన్న వాళ్లలో ఒక అపోహ ఉంటుంది. అరటి పండ్లు, ఉడకబెట్టిన కోడి గుడ్లు వెంట వెంటనే తింటే శరీరానికి మేలు అని కొంతమంది ఆ పద్ధతినే అనుసరిస్తుంటారు. కానీ వాస్తవానికి అరటి పండ్లు తిన్న తర్వాత కోడి గుడ్డు (Eggs with Banana) తినడం అనేది ఆరోగ్యానికి అస్సలే మంచి అలవాటు కాదని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.
మరీ ముఖ్యంగా జిమ్‌కి (Foods to avoid) వెళ్లే వారికి ఈ అలవాటు ఉన్నట్టయితే, అది మరింత ప్రమాదకరం అంటున్నారు. ఈ రెండింటిని ఒకదానివెంట మరొకటి తినడం వల్ల ఆరోగ్యానికి హానికరం అనేది వారి సూచన.
Also read : Kidneys health tips: మీ కిడ్నీలు ఎలా ఉన్నాయి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలా తెలుసుకోండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook