Ginger For Health: అల్లం.. డయాబెటిక్ రోగులకు వరం! ఇతర ప్రయోజనాలు ఏంటంటే..!
Ginger For Health: అల్లం ఎవరి కిచెన్‌లో అయినా సులభంగా దొరుకుతుంది. కాబట్టి మీరు దీన్ని తప్పక తినాలి. దీంట్లో ఎన్నో అద్భుత ప్రయోజనాలు ఉన్నాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇదోక వరం.
Ginger For Health: అల్లం గురించి మనందరికీ తెలిసిందే. కూరల్లో, పచ్చళ్లలో ఎక్కువగా ఉపయోగిస్తారు. అల్లం (Ginger Benefits) ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. డయాబెటిక్ పేషెంట్లకు ఇదోక వరమనే చెప్పాలి. ఇది రక్తంలో చక్కెరను కంట్రోల్ చేస్తుంది. కాబట్టి అల్లం తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
తక్కువ మోతాదులో తీసుకోండి
రక్తంలో చక్కెరను నియంత్రించడానికి డయాబెటిక్ రోగులు పరిమిత పరిమాణంలో అల్లం తినాలని కొన్ని నివేదికలు పేర్కొంటున్నాయి. మీరు రోజుకు 4 గ్రాముల అల్లం తింటే, అది రక్తంలో చక్కెర స్థాయిని (Blood sugar level) తగ్గించడంలో మరియు ఇన్సులిన్ ఉత్పత్తిని నియంత్రించడంలో సహాయపడుతుంది. అలా కాకుండా దీనిని అధికంగా తీసుకుంటే, మీ గుండెల్లో మంట, విరేచనాలు లేదా ఉదర సంబంధిత సమస్యలు రావచ్చు.
ఇతర ప్రయోజనాలు
**మైగ్రేన్ నొప్పి ఎక్కువగా ఉన్నవారు కూడా దీనిని తీసుకోవచ్చు. ఇది మీ నొప్పికి వెంటనే ఉపశమనం ఇస్తుంది. ముఖ్యంగా పచ్చి అల్లం తీసుకోవడం వల్ల ఎక్కువ ఫలితం ఉంటుంది.
**కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో అల్లం చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే దీనివల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది. మీరు దీన్ని టీతో కూడా ఉపయోగించవచ్చు.
Also Read: Dates With Milk: పాలలో ఖర్జూరం కలిపి తినడం దంపతులకు ఎంతో ప్రయోజనం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook