Dengue Fever: శీతాకాలం వచ్చిందంటే చాలు సీజనల్ వ్యాధులు వెంటాడుతుంటాయి. మరీ ముఖ్యంగా డెంగ్యూ వంటి ప్రమాదకర వ్యాధుల ముప్పు ఈ సమయంలో అధికంగా ఉంటుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. డెంగ్యూ అనగానే అంతకంతకూ పడిపోయే ప్లేట్‌‌లెట్ కౌంట్ కీలక సమస్యగా మారుతుంది. మరి ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలనేది తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సీజన్ మారడంతో డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. డెంగ్యూ దోమల బెడద అధికమైంది. డెంగ్యూ అనేది ఏ మాత్రం చిన్నపాటి నిర్లక్ష్యం వహించినా ప్రాణాంతకం కాగల వ్యాధి. అందుకే డెంగ్యూ అంటే చాలామంది భయపడిపోతుంటారు. సకాలంలో మందులు తీసుకోవడంతో పాటు డైట్‌లో కొన్ని పదార్ధాలు తప్పకుండా ఉండేట్టు చూసుకోవాలి. అప్పుడే ప్లేట్‌లెట్ కౌంట్ తగ్గకుండా ఉంటుంది. లేకపోతే ప్లేట్‌లెట్ కౌంట్ పడిపోయి ప్రమాదకరంగా మారవచ్చు. డెంగ్యూ నుంచి కాపాడుకునేందుకు కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. డెంగ్యూ సోకితే తీవ్రమైన జ్వరం, తలనొప్పి, విపరీతమైన నీరసం ఆవహిస్తుంది. డెంగ్యూ నుంచి పూర్తి స్థాయిలో కోలుకునేందుకు కొన్ని సందర్భాల్లో చాలా సమయమే పట్టేస్తుంది. అందుకే డైట్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. 


డెంగ్యూ రోగులు రోజువారీ డైట్‌లో బ్రోకలీ తప్పకుండా ఉండేట్టు చూసుకోవాలి. ఇందులో విటమిన్ కే పెద్ద మొత్తంలో ఉంటుంది. ఇది రక్తంలో ప్లేట్‌లెట్స్‌ను పెంచడంలో ఉపయోగపడుతుంది. ఎందుకంటే డెంగ్యూ సోకినప్పుడు ప్లేట్‌లెట్ కౌంట్ రోజురోజుకూ పడిపోతుంటుంది. ఈ పరిస్థితుల్లో ప్లేట్‌లెట్ కౌంట్ పెంచే ఆహార పదార్ధాలను డైట్‌లో భాగంగా చేసుకోవాలి.


ఇక డెంగ్యూ రోగులు తప్పకుండా తినాల్సిన మరో ఫ్రూట్ కివీ. ఇందులో పోషక విలువలు చాలా ఎక్కువ. ముఖ్యంగా విటమిన్ సి, పొటాషియం పరిమాణం అధికంగా ఉంటుంది. దాంతోపాటు పోలీఫెనోల్స్ , యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. బ్లడ్ ప్లేట్‌లెట్స్ కౌంట్ పెంచడంలో దోహదపడతాయి.


కొబ్బరి నీళ్లు డెంగ్యూ రోగులకు అమృతంలా పనిచేస్తాయి. ఎందుకంటే ఇందులో మినరల్స్ చాలా ఎక్కువ. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల డీ హైడ్రేషన్ సమస్య దూరమౌతుంది. శరీరంలో ఎలక్ట్రోలైట్స్‌ను బ్యాలెన్స్ చేస్తుంది. శరీరానికి అదనపు ఎనర్జీ ఇస్తుంది. రోజుకు రెండు గ్లాసుల కొబ్బరి నీళ్లు తాగాల్సి ఉంటుంది. ఇక ఈ మూడింటికీ తోడు బొప్పాయి పండు దివ్యౌషధమని చెప్పాలి. బొప్పాయి ఆకుల రసం రోజూ పరగడుపున ఉదయం, రాత్రి ఒక స్పూన్ తాగితే చాలు చేదుగా ఉన్నా చాలావేగంగా ప్లేట్‌లెట్ కౌంట్ పెరుగుతుంది. 


Also read: Water Tips: నీరు శరీరానికి ఎందుకు అవసరం, రోజుకు ఎవరు ఎంత నీళ్లు తాగాలి, ఎలా తాగాలి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook