Water Tips: నీరు శరీరానికి ఎందుకు అవసరం, రోజుకు ఎవరు ఎంత నీళ్లు తాగాలి, ఎలా తాగాలి

Water Tips: మనిషి శరీరంలో నీటి పాత్ర, అవసరం అత్యంత కీలకం. శరీరంలో నీరు మూడు వంతులుంటుంది. అందుకే నీటి కొరత ఏ మాత్రం తలెత్తినా డీహైడ్రేషన్, ఇతర అనారోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. అందుకే రోజూ తగిన పరిమాణంలో నీరు తాగాలని సూచిస్తుంటారు వైద్యులు. ఆ వివరాలు తెలుసుకుందాం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 6, 2023, 08:17 PM IST
Water Tips: నీరు శరీరానికి ఎందుకు అవసరం, రోజుకు ఎవరు ఎంత నీళ్లు తాగాలి, ఎలా తాగాలి

Water Tips: శరీరంలో వివిధ అంగాల పనితీరు శరీరంలో ఉండే నీటి పరిమాణాన్ని బట్టి ఉంటుంది. నీటి పరిమాణం తగినంతగా ఉన్నంతవరకే అంతా సక్రమంగా ఉంటుంది. నీటి కొరత ఏర్పడితే పలు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ముఖ్యంగా కిడ్నీ, చర్మ వ్యాధులకు ప్రధాన కారణం నీటి కొరతే. ఈ రెండు సమస్యలు కాకుండా డీ హైడ్రేషన్ సమస్య మరింతగా ఇబ్బంది పెడుతుంటుంది. 

మనిషి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రధానంగా కావల్సింది నీళ్లు. రోజూ తగిన పరిమాణంలో నీటిని తీసుకుంటేనే ఆరోగ్యంగా ఉండగలుగుతారు. చాలామంది వేసవిలోనే నీటి అవసరాన్ని గుర్తిస్తుంటారు. కానీ శీతాకాలంలో ఎక్కువగా ఈ సమస్య ఏర్పడుతుంటుంది. కారణం దాహం వేయని కారణంగా చాలామంది నీళ్లు పెద్దగా తాగడానికి ఆసక్తి చూపించరు. ఈ వైఖరి నీటి కొరతకు దారి తీసి డీహైడ్రేషన్ ఇతర సమస్యలకు కారణమౌతుంది. అందుకే సీజన్‌తో సంబంధం లేకుండా ప్రతి రోజూ తగిన పరిమాణంలో నీళ్లు తప్పకుండా తీసుకోవాలి. అయితే రోజుకు ఎంత నీరు తాగాలి, ఏ సమయంలో తాగాలి, భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగవచ్చా లేదా అనే సందేహాలు సహజంగా తలెత్తుతుంటాయి. ఏదేమైనా నీటితో నిండిన శరీరానికి నీటి అవసరం చాలా ఎక్కువ. 

నీరు ఎంత తాగాలనేది అందరికీ ఒకేలా ఉండకపోవచ్చంటున్నారు వైద్యులు. శరీరానికి కావల్సిన నీటి పరిమాణం అనేది సాధారణంగా శరీర బరువుని బట్టి నిర్ణయమౌతుంది. ప్రతి కేజీ బరువుకు 35 ఎంఎల్ నీరు అవసరమౌతుంది. ఓ వ్యక్తి బరువు 60 కిలోలు ఉందనుకుంటే..ఆ వ్యక్తి రోజుకు 2100 ఎంఎల్ నీళ్లు అంటే 2 లీటర్ల నీళ్లు తాగాల్సి ఉంటుంది.

ఇక నీళ్లు ఎలా తాగాలనేది మరో సందేహం. అన్నింటికంటే ఉత్తమమైన మార్గం నీళ్లు ఎప్పుడూ కూర్చుని తాగడం మంచి విధానం. పడుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ తాగకూడదు. కూర్చుని తాగడం వల్ల నీరు ప్రతి శరీర భాగానికి క్రమంగా చేరుతుంది. 

భోజనానికి ముందు తాగాలా లేదా తరువాత తాగాలా అనేది పెద్ద సమస్య కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎప్పుడైనా తాగవచ్చంటున్నారు. బరువు తగ్గాలనుకున్నప్పుడే భోజనం ముందు తాగాలా తరువాత తాగాలా అనే ప్రశ్న ఉత్పన్నమౌతుందంటున్నారు. భోజనం ముందు నీళ్లు తాగితే బరువు తగ్గుతుంది. మార్కెట్‌లో లభించే నీళ్ల కంటే సాధారణ నీళ్లే అత్యుత్తమమైనవంటున్నారు వైద్యులు. అయితే తాగే నీళ్లు పరిశుభ్రంగా ఉండాలి. 

సాధ్యమైనంతవరకూ నీళ్లను మరిగించి చల్లార్చి తాగడం చాలా మంచిది. ఇదే మంచి పద్ధతి. అందుకే చాలామంది ఉదయం వేళ గోరువెచ్చని నీళ్లు తాగుతుంటారు. మీరు రోజూకు అవసరమైన నీళ్లు తీసుకుంటున్నారా లేక నీటి కొరత ఏర్పడిందా అనేది మూత్రం రంగుని బట్టి తెలిసిపోతుంది. 

Also read: Ayurvedic Tips: కిడ్నీలు, లివర్ ఆరోగ్యాన్ని పెంచే 5 అద్భుతమైన మూలికలు ఇవే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News