Bone Health: ఎముకలు బలహీనంగా ఉన్నాయా, ఈ విటమిన్లు తీసుకుంటే చాలు
Bone Health: మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకునే ఆహారం కూడా బలవర్దకంగా ఉండాలి. ఆహారపు అలవాట్లు సరిగ్గా లేకపోతే వివిధ రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. మనిషి ఫిట్ అండ్ హెల్తీగా ఉండేందుకు హెల్తీ డైట్ చాలా అవసరం.
Bone Health: శరీరం ఫిట్ అండ్ స్ట్రాంగ్‌గా ఉండాలంటే ముందు ఎముకలు బలంగా ఉండాలి. బలవర్ధకమైన ఆహార పదార్ధాలు తిన్నప్పుడే ఎముకలు పటిష్టంగా, బలంగా ఉంటాయి. మనం తీసుకునే ఆహార పదార్ధాల్లో ఉండే కొన్ని విటమిన్లు ఎముకల్ని పటిష్టం చేస్తాయి. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
శరీరం ఎదుగుదల, ఆరోగ్యం, ఎముకలు పటిష్టంగా ఉండటం అనేది రోజూ తినే ఆహరాన్ని బట్టి ఉంటుంది. హెల్తీ ఫుడ్స్ అనేవి శరీరాన్ని ఫిట్ అండ్ హెల్తీగా ఉంచుతాయి. దీనికోసం పోషక పదార్ధాలు అధికంగా ఉండే పదార్ధాలు అంటే బలవర్ధకమైన ఆహారమే ఎక్కువగా తీసుకోవాలి. జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్ రుచికరంగా ఉంటాయో కానీ బలవర్ధకం కావు. బలవర్ధకమైన ఆహారమంటే రోజు డైట్‌లో పండ్లు, తాజా కూరగాయలు ఉండేట్టు చూసుకోవాలి. శరీరంలో ఎముకలు బలంగా లేకపోతే వివిద రకాల సమస్యలు ఏర్పడతాయి. ఎముకలు బలంగా ఉండాలంటే ముఖ్యంగా కావల్సింది కాల్షియం. కొన్ని రకాల విటమిన్లు కూడా ఎముకల్ని పటిష్టంగా మార్చేందుకు దోహదపడతాయి.
విటమిన్ సితో ఎముకలు పటిష్టంగా ఉండటమే కాకుండా ఇమ్యూనిటీ బలోపేతమౌతుంది. అందుకే ఎముకలు బలహీనంగా ఉనప్పుడు విటమిన్ సి తీసుకోవడం మంచి పద్ధతి. దీనికోసం విటమిన్ సి అధికంగా ఉంటే ఉసిరి, బొప్పాయి, ఆరెంజ్, నిమ్మ వంటివి తీసుకోవాలి. ఈ పండ్లు తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా మారడమే కాకుండా ఎముకలకు సంబంధించిన సమస్యలు దూరమౌతాయి.
విటమిన్ డి లోపముంటే ఎముకలు బలహీనమైపోతాయి. శరీరంలో విటమిన్ డి లోపముంటే ఎముకల్లో తీవ్రమైన నొప్పి, సమస్యలు ఎదురౌతాయి. సూర్యరశ్మి కిరణాల ద్వారా విటమిన్ డి సమృద్ధిగా లభిస్తుంది కానీ బాదం, బీట్‌రూట్, మష్రూం, ఆరెంజ్‌లో సైతం విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది.
ఇక ఎముకల బలోపేతానికి కావల్సిన మరో విటమిన్ కే. ఎముకల్లో ఖనిజ పదార్ధాలు డెన్సిటీ కొనసాగించేందుకు విటమిన్ కే ఉపయోగపడుతుంది. విటమిన్ కే అనేది ఎముకల ఆరోగ్యానికి చాలా మంచిది. ఎముకలు బలహీనంగా ఉన్నా లేదా ఎముకలు పటిష్టంగా ఉండాలన్నా విటమిన్ కే లేదా విటమిన్ కే పుష్కలంగా ఉండే పదార్ధాలను తీసుకోవల్సి ఉంటుంది.
Also read: Digestive System: జీర్ణక్రియ బలహీనమైతే ఏం జరుగుతుంది, ఈ లక్షణాలు కన్పిస్తే నిర్లక్ష్యం వద్దు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook