ప్రపంచ వ్యాప్తంగా ప్రధాన సమస్య కరోనా వైరస్. ఈ మహమ్మారిని ఎదుర్కోవాలంటే మానసికంగా సిద్ధంగా ఉండాలి, ఒత్తిడిని (Health Tips to Manage Stress), కోపాన్ని తగ్గించుకుని, ఒంట్లో ఓపికను పెంచడం వల్ల ప్రయోజనం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడికి గురైతే రోగ నిరోధకశక్తి కొద్ది కొద్దిగా నశిస్తుంది. కనుక రోగ నిరోధశశక్తిని పెంచుకోవడంతో పాటు ఆరోగ్యాన్నిచ్చే ఆహారం తీసుకోవాలి. మరికొన్ని చిట్కాలు పాటిస్తే కోవిడ్19 మహమ్మారి బారిన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. Tips: జలుబు వస్తే కంగారొద్దు.. కరోనానో కాదో ఇలా గుర్తించండి 
Effects Of Skipping Breakfast: బ్రేక్‌ఫాస్ట్ మానేస్తే ఎన్ని నష్టాలో తెలుసా..!
  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒత్తిడిని జయించేందుకు కొన్ని చిట్కాలు (Health Tips To Manage Stress)  
నిద్ర(Sleep): కంటి నిండా నిద్ర ఉంటే ఆ వ్యక్తులకు ఒత్తిడిని సులువగా జయిస్తారని తెలిసిందే. రాత్రిపూట త్వరగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తే మానసిక ప్రశాంతత దొరుకుంది.


వేళకు తిండి (Healthy Diet): సమయానికి ఆహారం తీసుకుంటే పనిపట్ల శ్రద్ధ పెరిగి, మీ ఫలితాలు పాజిటివ్‌గా ఉంటాయి. ఆరోగ్యకర, రోగ నిరోధకశక్తిని పెంచే ఆహారం తీసుకోవాలి. చక్కెర, కార్బొహైడ్రేట్లను తక్కువగా తీసుకోవడం ఉత్తమం. COVID19 Symptoms: కరోనా పేషెంట్లలో ముఖ్యమైన లక్షణాలివే


మద్యం తగ్గించాలి (Control Alcohol): చెడు అలవాటు అంటూనే రోజూ పెగ్గులు లాగించేస్తుంటారు కొందరు. కానీ మద్యం సేవించిన తర్వాత మీ కోపం పెరిగి ఇతరులతో గొడవ పడటం, వారి మీద కోపాన్ని ప్రదర్శిస్తారు. దీని వల్ల కొన్ని బంధాలు కోల్పోతారు. సాధ్యమైనంతవరకు మద్యం తీసుకోవడం తగ్గిస్తే మీకు అందరూ చేరువైనట్లు కనిపించి ఒత్తిడిని సైతం చిత్తు చేసేస్తారు. Diabetes Prevention: షుగర్ పేషెంట్స్ అలా నడిస్తేనే ప్రయోజనం


శారీరక శ్రమ (Yoga and exercise): ప్రతిరోజూ ఉదయం యోగా లేక వ్యాయామం చేస్తే శారీరకంగా ఫిట్‌గా ఉంటారు. ఏదైనా సాధిస్తాను అనే పాజిటివ్ ఫీలింగ్ కలుగుతుంది. దీంతో మీకు ఇబ్బందులు ఎదురైనా ప్రశాంతంగా వాటికి పరిష్కారం సాధిస్తారు. 


వదంతులకు చెక్ (Avoid Rumours): మీ చుట్టు అది జరిగింది, వాళ్లు ఇలా, వీళ్లు ఇలా చేశారంటూ పొరుగువారిపై మీతో డిస్కషన్ వస్తే అక్కడే ఆపేయండి. వీటి బదులు మీరు ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించడం వల్ల మానసిక ప్రశాంతత దొరుకుతుంది. మీ పనులు సులువుగా పూర్తిచేసే అవకాశాలు కనిపిస్తాయి.


పాజిటివ్ ఆలోచనలు (Be Positive): కరోనా కష్ట కాలంలో జాగ్రత్తలు తీసుకోవాలి. తప్పనిసరి అయితేనే ఇంట్లోంచి కాలు బయటకు కదపాలి. అంతా బాగానే ఉందనుకుని పనులు చేసుకుంటూ పోతే మీకు ఏ కరోనా ఆలోచనలు రావు. ఏదో పనిలో బిజీగా ఉంటూనే ఆరోగ్య జాగ్రత్తలు పాటిస్తే ఒత్తిడి, కోపం లాంటివి మీ దరిచేరవని సైకాలజిస్టులు చెబుతుంటారు. Weight Loss Tips: బొజ్జ రాకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి 
Health Tips: జలుబు వస్తే కంగారొద్దు.. కరోనానో కాదో ఇలా గుర్తించండి 
Health Tips: ఒంట్లో అధిక వేడి తగ్గించే చిట్కాలు