మన చుట్టూ లభించే వస్తువులు లేదా పదార్ధాలతో ఆరోగ్యాన్ని చాలా వరకు సంరక్షించుకోవడమే కాకుండా ఫిట్‌‌గా ఉండవచ్చు. అందులో కీలకమంది లవంగం. ఈ ఒక్కటి చాలు..మీ ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రతిరోజూ పరగడుపున లవంగం తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఆరోగ్యం కోసం చాలామంది రోజూ పరగడుపున వివిధ రకాల పదార్ధాలు తీసుకుంటుంటారు. పరగడుపున తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలే వేరుగా ఉంటాయి. పరగడుపున లవంగం తీసుకుంటే.ఆరోగ్యపరంగా కలిగే లాభాలేంటో చూద్దాం..


పరగడుపున లవంగంతో కలిగే ప్రయోజనాలు


1. రోజూ పరగడుపున లవంగం తీసుకుంటే..జీర్ణక్రియ మెరుగుపడటమే కాకుండా.జీర్ణక్రియకు సంబంధిత చాలా సమస్యలు దూరమౌతాయి. ఒకవేళ మీకు గ్యాస్, అజీర్ణం సమస్యలుంటే..పరగడుపున లవంగం తినడంతో ఆ సమస్యల్నించి ఉపశమనం పొందవచ్చు.


2. ఇమ్యూనిటీని పటిష్టం చేసేందుకు లవంగం కీలకపాత్ర పోషిస్తుంది. లవంగం తినడం వల్ల శరీరంలోని విషపదార్ధాలు బయటకు తొలగిపోతాయి. ఫలితంగా బ్లడ్ ప్యూరిఫై జరిగి శరీరంలో వైట్ బ్లడ్‌సెల్స్ నిర్మాణం సాధ్యమౌతుంది. అంతేకాకుండా..లవంగంలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉన్నందున ఇమ్యూనిటీ బూస్టర్‌గా పనిచేస్తుంది. 


3. పంటి నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు లవంగం అద్భుతంగా పనిచేస్తుంది. ఈ విధానం అనాదిగా అమల్లో ఉన్నదే. పంటి నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు 1-2 లవంగాలను పంటి కింద నొక్కిపెట్టి ఉంచుకోవాలి. లేదా లవంగం నూనె కూడా రాసుకోవచ్చు. దీనివల్ల నొప్పి కూడా తగ్గుతుంది.


4. మీరు మీ బరువు తగ్గించుకోవాలనుకుంటే..లవంగం అద్భుతంగా పనిచేస్తుంది. ఉదయం వేళ సాధారణంగా శరీరం మెటబోలిజం తక్కువగా ఉంటుంది ఈ పరిస్థితుల్లో లవంగం తినడం వల్ల మెటబోలిజం వృద్ధి చెందుతుంది. ఫలితంగా బరువు తగ్గుతారు. లవంగం తిన్న తరువాత గోరువెచ్చని నీరు తాగితే మంచి ఫలితాలుంటాయి.


Also read: Google Chrome Update: మీ గూగుల్ క్రోమ్ అప్‌డేట్ చేశారా..లేకపోతే ఇంతే సంగతులు, వెంటనే చేయండి మరి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook