కరోనా వైరస్ (CoronaVirus) వ్యాప్తితో ఎక్కడ చూసినా ప్రజల్లో భయాందోళన కనిపిస్తుంది. అయితే డాక్టర్లు మాత్రం బలవర్ధక ఆహారాన్ని తీసుకోండి. రోగ నిరోధకశక్తిని పెంచుకోవాలని, తద్వారా కోవిడ్19 బారి నుంచి మిమ్మల్ని కాపాడుకోవచ్చునని (Health Tips During COVID19) చెబుతున్నారు. ముఖ్యంగా చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, ముఖాన్ని చేతులతో తడమరాదని వైరస్ వ్యాప్తిని నియంత్రించవచ్చునని పేర్కొన్నారు. బాదం ఆరోగ్యానికి మేలు (Health Benefits of Badam) చేస్తుంది. కరోనా సమయంలో ఎక్కువగా గిరాకీ వచ్చిన ఐటమ్స్‌లో బాదం ఒకటి. Health Tips: ఒంట్లో అధిక వేడి తగ్గించే చిట్కాలు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బాదం తినడం వల్ల ప్రయోజనాలు (Health Benefits of Eating Almond)


  • Health Tips During Corona: ప్రతిరోజూ ఉదయం బాదం తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తెల్లరక్తకణాల సామర్థ్యం పెరిగి ఇన్‌ఫెక్షన్ల బారిన పడే అవకాశాలు చాలా తక్కువగా ఉంటుంది.

  • బాదం తింటే విటమిన్ ఈ పుష్కలంగా లభిస్తుంది. బాదం మంచి యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసి కొవ్వును నియంత్రిస్తుంది.

  • బాదంలో ఆరోగ్యానికి మేలు చేసే కొవ్వులు, మాంసకృతులు, విటమిన్లు, ఖనిజ లవణాలు సమృద్ధిగా లభిస్తాయి. మీ ఆరోగ్యం కోసం ఈ Health Tips పాటించండి

  • తరచుగా బాదం తినడం వల్ల మలబద్దకం సమస్యకు చెక్ పెడుతుందని మీకు తెలుసా. ప్రతిరోజూ ఓ నాలుగైదు బాదం పప్పులు తింటే మీ శరీరానికి ఎంతో శ్రేయస్కరం.

  • బాదం తింటే మీకు కావాల్సినంత పొటాషియం లభిస్తుంది. ఇందులో సోడియం తక్కువ కనుక రక్తపోటు (Blood Pressure) సమస్య అసలే ఉండదు. రక్తప్రసరణ సరిగా జరిగే గుండె సంబంధిత సగం జబ్బులకు పరిష్కారం దొరికినట్లే. Health Tips: కరివేపాకు జ్యూస్ తాగారా.. ఈ ప్రయోజనాలు తెలుసా?

  • ఉదయాన్నే బాదం తింటే శరీరానికి కావలసిన ఇనుము లభిస్తుంది. బాదంలో ఉంటే మోనోశాచ్యురేటెడ్, పాలీశాచ్యురేటెడ్స్ శరీరంలో నిల్వ ఉండే చెడు కొవ్వులను నాశనం చేస్తుంది.

  • బాదం తరచుగా తినేవారికి గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం తక్కువ అని అధ్యయనాలు చెబుతున్నాయి. వారానికి నాలుగైదు రోజులు బాదం తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. Depression: ఈ యోగాసనాలతో డిప్రెషన్ పరార్! 


Carrot Benefits: క్యారెట్ తింటే ఈ 10 ప్రయోజనాలు తెలుసా!