దాదాపు దశాబ్దం కిందటి వరకు కరివేపాకు (Curry Leaves)ను వంటలల్లో విరివిగా వాడేవారు. కానీ ఇప్పుడు తరం కరివేపాకు, కొత్తిమీర లాంటి ఆకుకూరలను అంతగా తినడం లేదు. అవి తింటే ఎన్నో ప్రయోజనాలున్నాయి (Curry Leaves Benefits). జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వును కరిగిస్తుంది. కొత్తిమీర అని తీసి పారేయొద్దు.. ఈ ప్రయోజనాలు తెలుసా!
కరివేపాకు జ్యూస్ కోసం పెద్దగా ఇబ్బంది పడాల్సిన పని లేదు. తాజాగా, శుభ్రంగా ఉన్న కొన్ని కరివేపాకులను బ్లెండర్ లేక గ్రైండర్‌లో గ్రైండ్ చేసుకోవాలి. వీలైతే కరివేపాకు ఆకులను మెత్తగా దంచినా పరవాలేదు. ఆ తర్వాత కొన్ని నీళ్లు కలిపి మళ్లీ గ్రైండ్ చేసుకుంటే మీకు కావాలసిన కరివేపాకు జ్యూస్ రెడీ అవుతుంది. సులువుగా రోగ నిరోధకశక్తిని పెంచే చిట్కాలు
కరివేపాకు ప్రయోజనాలు (Benefits Of Curry Leaves)
- కరివేపాకు రెగ్యూలర్‌గా తింటే బాడీ డిటాక్స్ అవుతుంది. అంటే కొన్నిసార్లు కడుపులో తిప్పడం, వికారం లాంటివి అవుతాయి కదా. కరివేపాకు ద్వారా ఇది కంట్రోల్ అవుతుంది.
- కొవ్వు కరిగించడంలోనూ కరివేపాకు కీలకపాత్ర పోషిస్తుంది. కొవ్వు వలన రక్తం సరఫరా జరగదు. కనుక కరివేపాకు తింటే మీ ఆరోగ్యానికి ప్లస్ పాయింట్ అవుంతుంది. అతి వేగంగా తింటున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు
- కరివేపాకు తినడం, కరివేపాకు జ్యూస్ తాగడం చేస్తే అజీర్తి సమస్య దూరం చేస్తుంది. మీకు జీర్ణక్రియ సరిగా జరిగి తగిన సమయానికి ఆకలి వేస్తుంది. వేళకు ఆహారం తింటే ఆరోగ్యం మీ సొంతం.
- కరివేపాకును వంటల్లో వాడతారు. కానీ కొందరు తినడకుండా పడవేస్తుంటారు. అయితే కరివేపాకు తినడం ఇబ్బందిగా ఉంటే జ్యూస్ చేసుకుని తాగడం మంచిది. సులువుగా తాగేయవచ్చు. దీనివల్ల పోషకాలు, విటమిన్లు సులువుగా రక్తంలోకి చేరతాయి.
- బరువు తగ్గాలనుకునేవారు కరివేపాకు జ్యూస్ తగ్గడం వల్ల ప్రయోజనం ఉంటుంది. అందుకు తగ్గ శారీరక శ్రమ కూడా చేయాల్సి ఉంటుంది. Carrot Benefits: క్యారెట్ తింటే ఈ 10 ప్రయోజనాలు తెలుసా!