Healthy Breakfast: సాధారణంగా అల్పాహారంలో చాలా మంది ఇడ్లీ, పూరి, దోశ వంటివి తింటుంటారు. కానీ, ప్రస్తుతం ఆరోగ్యంపై ధ్యాసతో ప్రస్తుతం చాలా మంది పోషకాలతో పాటు శక్తిని ఇచ్చే అల్పహారాన్ని తింటున్నారు. దీని వల్ల ఆరోగ్యాన్ని పొందడమే కాకుండా.. రోజంతా యాక్టివ్ గా ఉండొచ్చు. ఈ నేపథ్యంలో పోషకాహార నిపుణులు కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని సిఫార్సు చేస్తారు. అయితే ప్రతిరోజూ ఉదయాన్నే ఎలాంటి అల్పహారాన్ని తీసుకోవాలో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముస్లీ


ముస్లీని పాలను కలిపి తినొచ్చు. ఇందులో ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్పరస్ వంటి పోషకాలు ఉన్నాయి. ఇది చాలా కరకరలాడుతూ ఉంటుంది. కాబట్టి పిల్లలు కూడా దీన్ని ఇష్టపడతారు.


చాక్లెట్ స్ప్రెడ్


మీ టోస్ట్ మీద చాక్లెట్ స్ప్రెడ్ పూసుకొని తినొచ్చు. మిల్క్ షేక్ తో కలిపి ఆస్వాదించవచ్చు. 


కార్న్ ఫ్లేక్స్


ఒక కప్పు పాలలో కార్న్ ఫ్లేక్స్ తినడం కూడా చాలా మంచిది. పాలను చల్లగా లేదా వేడిగా ఉంచి అందులో అరటిపండ్లు, యాపిల్స్ ముక్కలు, తేనె కలిపి తినొచ్చు. 


పీనట్ బటర్


ఉదయాన్నే మనం తినే ఆహారంలో ఎక్కువ శక్తి వచ్చే పదార్థాలను చేర్చుకుంటాం. అయితే అల్పాహారంలో పీనట్ బటర్ (వేరుశనగ వెన్న) తీసుకోవడం మేలు కలుగుతుంది. 


గుడ్లు, టోస్ట్


అల్పాహారం కోసం గుడ్లు, టోస్ట్‌ తీసుకోవచ్చు. దీని ద్వారా ప్రోటీన్, కొవ్వు, ఐరన్ అధికంగా ఉంటాయి.


Also Read: Orange Peel Benefits: నారింజ తొక్కతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా?


Also Read: Dangerous Herbs: వేసవిలో వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ తినొద్దు.. లేదంటే అంతే!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.