Orange Peel Benefits: భారతదేశంలో నారింజ ఉత్పత్తి చాలా ఎక్కువ. ఈ పండులోని పుల్లని-తీపి రుచి కారణంగా చాలా మంది నారింజను ఇష్టపడతారు. నారింజ పండును తినడం వల్ల విటమిన్ సి, కాల్షియం, ఫోలేట్ ఆరోగ్యానికి అందడమే కాకుండా.. అవి మేలు చేస్తాయి. సాధారణంగా నారింజ పండు తిని.. తొక్కను విసిరివేస్తారు. కానీ, నారింజ తొక్కతో కూడా అనేక ఆరోగ్యా ప్రయోజనాలు ఉన్నాయి.
నారింజ తొక్కతో 5 అద్భుతమైన ప్రయోజనాలు..
1. చర్మానికి మేలు..
ఆరెంజ్ తొక్క మన చర్మానికి మేలు చేస్తుంది. చర్మం లేదా ముఖంపై ఎల్లప్పుడూ జిడ్డుగా ఉంటే దాన్ని నివారించుకునేందుకు నారింజ తొక్క ఉపయోగపడుతుంది. నారింజ తొక్కలను ఎండబెట్టి, వాటిని మెత్తగా పొడి చేసుకొని.. అందులో తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖంలో కాంతివంతమవుతుంది.
2. నిద్రకు సహాయపడుతుంది
కొందరికి రాత్రుళ్లు నిద్ర సరిగా ఉండదు. ఈ సమస్య ఉన్నవారికి నారింజ తొక్క ఉపయోగపడుతుంది. నారింజ తొక్కను నీటిలో వేసి బాగా మరిగించాలి. ఆ తర్వాత ఆ నీటిని తాగాలి. ఇలా క్రమం తప్పకుండా తాగడం వల్ల రాత్రి నిద్ర పడుతుంది.
3. రోగనిరోధక శక్తిని పెంచుతుంది
నారింజ తొక్క రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఆరెంజ్ తొక్కలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. దీని కారణంగా, నారింజ తొక్క రోగనిరోధక శక్తిని పెంచుతుంది. నారింజ తొక్కను చక్కెర, నిమ్మకాయతో కలిపి తినవచ్చు.
4. హెయిర్ కండీషనర్‌గా..
ప్రస్తుతం మార్కెట్లో జుట్టు సంరక్షణ కోసం అనేక ఉత్పత్తులు లభ్యమవుతున్నాయి. అందులో చాలా వరకు హానికరమైన రసాయనాలతో నిండి ఉన్నాయి. మనలో చాలా మంది జుట్టుకు ఖరీదైన కండిషనర్లను వాడుతుంటారు. దానికి బదులుగా నారింజ తొక్కలతో తయారు చేసిన మిశ్రమం ప్రభావంతంగా పనిచేస్తుంది.
5. చుండ్రు నుంచి విముక్తి
మీ జుట్టులో చుండ్రు సమస్య ఉంటే, నారింజ తొక్క దానిని నివారించుకోవచ్చు. ఆరెంజ్ తొక్కను ఎండబెట్టి పొడి చేసి, దానికి కొబ్బరి నూనె వేయాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు రాసుకోవడం వల్ల చుండ్రు తగ్గుతుంది.
(నోట్: పైన పేర్కొన్న సమాచారమంతా టిప్స్, నివారణ చర్యల నుంచి గ్రహించబడింది. దీన్ని Zee తెలుగు News ధ్రువీకరించడం లేదు.)
Also Read: Health Tips: మీకు బీపీ ఉందా..? అత్తి పండు..వాల్‌నట్‌లను తింటే కంట్రోల్ అవుతుంది
Also Read: Health Tips: ఈ 5 పండ్లు మీ డైట్‌లో చేర్చుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.