Corona Diet: సాధారణంగా వైరల్ జ్వరాలు గానీ, ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు గానీ మాంసాహారానికి దూరంగా ఉండమని వైద్యులు చెబుతారు. మరి కరోనా విషయంలో ఏం చేయాలి. అసలు కరోనా సోకిన రోగులు ఏం తినాలి..శాకాహారుల పరిస్థితి ఏంటి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అన్ని అనారోగ్య సమస్యల కంటే కరోనా రోగం ప్రత్యేకమనే చెప్పాలి. అందుకే ఇతర ఆరోగ్య సమస్యలున్నప్పుడు దూరంగా పెట్టే మాంసాహారం ఇక్కడ ప్రియంగా ఉంటుంది. కరోనా రోగులు (Corona Patients) ఏం తినాలి, ఏం తినకూడదనే విషయంలో చాలామందికి సందేహాలున్నాయి. శాకాహారులైతే ఏం తినాలి, మాంసాహారులైతే ఏం తినాలనేదానిపై ప్రముఖ న్యూట్రిషన్లు ఇస్తున్న డైట్‌ఛార్ట్ ఇదే.


కరోనా రోగికి రోగం తీవ్రతను బట్టి  అతని శరీర బరువులో ప్రతి కిలోకు 1 -1.5 గ్రాములల ప్రోటీన్ ఇవ్వాలి. ఈ ప్రోటీన్స్ ఆహారం ద్వారా అందుకోవాలంటే గుడ్లు, చికెన్, చేపలు వంటివాటితోనే సాధ్యం. అందుకే కరోనా సోకినప్పుడు చికెన్(Chicken), గుడ్లు (Eggs) ఎక్కువగా తినమని వైద్యులు చెబుతుంటారు. సో కరోనా సోకినపపుడు మీరు ఒకవేళ మాంసాహారులైతే ( Non vegetarian) చికెన్, గుడ్లు, చేపలు వీలైనంత ఎక్కువగా తినడం మంచిది. 


ఇక మీరు శాకాహారులైతే (Vegetarians) పప్పు దినుసులు ఎక్కువగా తినాల్సి ఉంటుంది. వీటిలో కందిపప్పు, పెసర, మినప్పప్పు తదితరాల్లో 24 శాతం వరకు ప్రొటీన్‌ ఉంటుంది. అలాగే బొబ్బర్లు, రాజ్మా, శనగలు వంటి వాటిలో ప్రొటీన్‌తో పాటు బి విటమిన్, పీచు పదార్థాలు కూడా పుష్కలంగా లభిస్తాయి. పాల సంబంధ ఉత్పత్తులు చీజ్, పన్నీర్‌తో పాటు సీడ్స్, నట్స్‌ నుంచి కూడా ప్రొటీన్స్‌ అందుతాయి. ముఖ్యంగా సీడ్స్, నట్స్‌లో ఉండే ఎసెన్షియల్‌ ఫ్యాటీ యాసిడ్స్‌ రోగికి చాలా మేలు చేస్తాయి.


అదనపు సప్లిమెంట్స్..


మానవ శరీరానికి కావల్సిన విటమిన్లు సప్లిమెంట్స్‌(Vitamins Supplements) రూపంలో కూడా లభిస్తున్నాయి. కరోనా తీవ్రతను బట్టి సప్లిమెంట్స్‌ తీసుకోవడం అవసరమే. ఇవి కూడా మనిషి, మనిషికీ మారుతుంటాయి. ఉదాహరణకు ఎప్పుడూ ఏసీలో ఉండే వారికి విటమిన్‌ డి తప్పనిసరి. అయితే వీలైనంతగా సహజ పద్ధతుల్లో, ఆహారం ద్వారా లభించేలా చూసుకోవాలి. ఎక్కువ సప్లిమెంట్స్‌ తీసుకుంటే పౌష్టికాహార సమతుల్యత దెబ్బతింటుంది. మరీ ముఖ్యంగా రోగ నిరోధక శక్తి (Immunity Power)పెంచుకోవడం చాలా అవసరం. పోషకాలు అధికంగా కలిగిన ఆహార పదార్ధం తీసుకోవాలి. బాదం పప్పులో పోషక పదార్షాలు ఎక్కువగా ఉంటాయి. విటమిన్ ఇ (Vitamin E) పుష్కలంగా ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేయడంతో పాటు శ్వాస సంబంధిత రోగ నిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ఇందులో జింక్, ఐరన్ ఉంటాయి. అదే విధంగా ప్రో బయోటిక్ అధికంగా కలిగిన పెరుగు రోజూ తీసుకోవడం వల్ల శరీరంలో మంచి బ్యాక్టిరియా పెరుగుతుంది. మరోవైపు పెరుగులో కాల్షియం, మినరల్స్ ఉంటాయి.


Also read: Pulse Oximeter: పల్స్ ఆక్సీమీటర్ అంటే ఏమిటి, దాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook