Hairfall in Rainy Season: వర్షాకాలంలో జుట్టు రాలే సమస్యలు తలెత్తడం అత్యంత సహజం. వాతావరణంలో మార్పులు, జుట్టు తడవడం లేదా కాలుష్యం వంటి సమస్యలు అందుకు ఓ కారణమైతే.. పోషకాహారంలో లోపం అందుకు మరో కారణంగా వైద్యులు విశ్లేషిస్తున్నారు. మరి వర్షాకాలంలో జుట్టు రాలకుండా ఉండాలంటే ఏం చేయాలి... ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం రండి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పాలకూర
పాలకూరలో ఐరన్ అధిక మోతాదులో ఉంటుంది. ఇది జుట్టు ఆరోగ్యంగా ఉండటంలో కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే పాలకూరలో ఐరన్ తో పాటు విటమిన్ ఏ అండ్ సి, ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్, మెగ్నీషియం వంటివి కూడా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవన్నీ కూడా జుట్టును కుదుళ్ల నుంచి స్ట్రాంగ్ చేస్తాయి. 


పప్పు ధాన్యాలు
పప్పు ధాన్యాల్లో ప్రొటీన్, ఐరన్, జింక్, బయోటిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవేకాకుండా విటమిన్ బి , విటమిన్ సి అధికంగా ఉంటాయి. ఇవన్నీ కూడా జుట్టు పెరుగుదలలో ముఖ్యమైనవే అనే విషయం గుర్తుంచుకోవాలి.


వాల్ నట్స్
వాల్ నట్స్‌లో బయోటిన్, బి విటమిన్ ( B1, B6 B9), విటమిన్ ఇ మరెన్నో ప్రొటీన్స్, మెగ్నీషియం ఉంటాయి. ఇవన్నీ కూడా జుట్టును కుదుళ్ల నుంచి సంరక్షిస్తాయి. 


యుగర్ట్ 
యుగర్ట్‌లో విటమిన్ B5, విటమిన్ డి ఉంటాయి. ఇవి మీ కేశాలను, కుదుళ్లను బలంగా మారుస్తాయి. 


ఓట్స్
ఓట్స్‌లో ఫైబర్, జింక్, ఐరన్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పాలిఅన్‌సాచ్యురేటెడ్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలకు తోడ్పడతాయి. 


స్ట్రాబెర్రి పండ్లు
స్ట్రాబెర్రి పండ్లలో సిలికా అనే మినరల్స్ ఉంటాయి. ఇవి మీ జుట్టును బలంగా పెరిగేందుకు సహాయపడుతుంది. 


క్యారెట్, బంగాళాదుంపలు కూడా మీ జుట్టు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇవి మీ జుట్టును పొడిబారనివ్వకుండా చేయడంతో పాటు కుదుళ్లను బలంగా మారుస్తాయి. అయితే, డయాబెటిస్ ఉన్న వారు బంగాళాదుంప వంటి ఆహార పదార్థాలు తీసుకుంటే వారికి షుగర్ లెవెల్స్ ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుంది అనే విషయం మర్చిపోకూడదు. వర్షాకాలంలో ఇప్పుడు చెప్పుకున్న ఆహార పదార్థాలు తీసుకుంటూ తగిన జాగ్రత్తలు పాటిస్తే మీ జుట్టు ఎల్లప్పుడూ సురక్షితంగా, ఆరోగ్యంగా ఉంటుంది.