శరీరంలోని అన్ని అంగాల్లో ముఖ్యమైంది, కీలకమైంది గుండె. గుండె ఆరోగ్యంగా ఉన్నంతవరకే ప్రాణం నిలబడుతుంది. అందుకే గుండెను సదా ఆరోగ్యంగా ఉంచుకోవాలి. మరి గుండె ఆరోగ్యం కోసం జీవనశైలిలో ఎలాంటి మార్పులు చేయాలో తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవలి కాలంలో చెడు జీవనశైలి కారణంగా గుండె వ్యాధులు పెరుగుతున్నాయి. గత కొద్దికాలంగా పరిశీలిస్తే..హార్ట్ ఎటాక్ కారణంగా మరణిస్తున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గతంలో గుండెపోటు వ్యాధి అంటే వృద్ధులకే వచ్చేది. ఇప్పుడు మాత్రం వయస్సుతో సంబంధం లేదు. తక్కువ వయస్సువారికి కూడా గుండె వ్యాధులు వస్తున్నాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా లైఫ్‌స్టైల్ మార్చాల్సి ఉంటుంది. మీ డైట్‌లో మెగ్నీషియం ఎక్కువగా ఉండే పదార్ధాలు చేర్చాలి.


గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు డైట్‌లో చేర్చాల్సిన ఆహారం


డార్క్ చాకొలేట్ సహా చాలా వస్తువులు పోషక పదార్ధాలతో నిండి ఉంటాయి. ఇందులో ఐరన్, కాపర్, మాంగనీస్ ఎక్కువగా ఉంటాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. గుండె రోగాల ముప్పు కూడా తగ్గుతుంది.


నట్స్ మీ గుండె ఆరోగ్యానికి అద్భుతంగా పనిచేస్తాయి. ఎందుకంటే నట్స్ బ్లడ్ షుగర్, కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గిస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు రోజూ క్రమం తప్పకుండా నట్స్ తీసుకోవాలి.


సీడ్స్ ప్రతిరోజూ తీసుకోవల్సిందే. ఎందుకంటే సీడ్స్‌లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. అందుకే చియా సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్ , ఆనపకాయ విత్తనాలు తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి.


అరటి పండ్లు కూడా గుండె ఆరోగ్యానికి చాలా మంచివి. ఇందులో మెగ్నీషియం, పొటాషియం రెండూ ఉన్నాయి. అందుకే గుండె ఆరోగ్యం కోసం అరటి పండ్లు తప్పకుండా తీసుకోవాలి.


Also read: Immunity Boosters: ఈ పండ్లు తప్పకుండా తీసుకుంటే చాలు..ఈ చలికాలం సురక్షితమే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu    


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook