Triglycerides: శరీరంలో వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఒకదానికొకటి సంబంధమై ఉంటాయి. గత కొద్దిరోజులుగా హార్ట్ ఎటాక్ కేసులు పెరిగిపోతున్నాయి. అదే సమయంలో ట్రై గ్లిసరైడ్స్ లెవెల్స్ కూడా పెరిగిపోతుండటం ఆందోళనకు కారణమౌతోంది. ఆ వివరాలు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హార్ట్ ఎటాక్ కేసులు ఇటీవలి కాలంలో ఎక్కువౌతున్నాయి. ప్రతిరోజూ ఆనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల ఈ సమస్య సర్వ సాధారణమైపోయిది. నిపుణుల ప్రకారం..యువకుల్లో ఎక్కువగా గుండె వ్యాధుల సమస్యలు ఎదురౌతున్నాయి. అదే సమయంలో లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష చేయించుకుంటే..ట్రై గ్లిసరైడ్స్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నట్టు కన్పిస్తోంది. కొలెస్ట్రాల్ ఎక్కువైనప్పుడు ట్రై గ్లిసరైడ్స్ సంఖ్య పెరుగుతుంది. ఇది హార్ట్ ఎటాక్‌కు దారి తీస్తుంది. 


ట్రై గ్లిసరైడ్స్ అనేది మైనంలా ఉంటుంది. సాధారణ ఉష్ణోగ్రత వద్ద కరిగిపోతుంది. శరీరంలోని ధమనుల్లో పేరుకుపోతుంది. ట్రై గ్లిసరైడ్స్ గుండె నాళాల్లో కూడా పేరుకుపోగలవు. ఫలితంగా బ్లాకేజ్ ముప్పు పెరుగుతుంది. ట్రై గ్లిసరైడ్స్ లెవెల్ 150 దాటకూడదు. 400 వరకూ ఉంటే పరిస్థితి చాలా తీవ్రంగా ఉన్నట్టు అర్ధం. ఈ పరిస్థితుల్లో వెంటనే కార్డియాలజిస్ట్‌ను సంప్రదించాలి.


ట్రై గ్లిసరైడ్స్ గుర్తించడం కూడా చాలా సులభం. ఎవరికైనా శరీరంలో ట్రై గ్లిసరైడ్స్ ఎక్కువగా ఉంటే హార్ట్ ఎటాక్ ముప్పు పెరుగుతుంది. డైట్ సరిగ్గా లేకపోవడం, అనారోగ్యకరమైన డైట్ వల్ల శరీరంలో ట్రై గ్లిసరైడ్స్ ముప్పు పెరుగుతుంది. సాధారణంగా కొలెస్ట్రాల్ పెరిగేకొద్దీ ట్రై గ్లిసరైడ్స్ పెరుగుతాయి. కానీ చాలా సందర్భాల్లో కొలెస్ట్రాల్ సాధారణంగా ఉన్నా..ట్రై గ్లిసరైడ్స్ పెరుగుతాయి. సరకైన సమయంలో పరీక్ష చేయించుకోవాలి. 


గత కొద్దికాలంగా యువకుల్లో హార్ట్ ఎటాక్ కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా 25-40 ఏళ్ల వయస్సు యువకుల్లో కూడా ట్రై గ్లిసరైడ్స్ అధికంగా ఉంటున్నాయి. ఇదంతా జంక్ ఫుడ్ తినడం వల్ల జరుగుతోంది. ఇలాంటి అలవాట్లు గుండె వ్యాధులకు కారణంగా మారుతున్నాయి. అందుకే డైట్‌లో ప్రోటీన్లు, విటమిన్లు తప్పకుండా తీసుకోవాలి.


Also read: Cholesterol Control: ఎలాంటి ఖర్చు లేకుండా శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌కు ఇలా 8 రోజుల్లో చెక్‌ పెట్టండి..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook