Heart Attack Symptoms: శరీరంలో ప్రధానమైన అంగం గుండె. గుండె ఆరోగ్యంగా ఉంటేనే జీవితం ఉంటుంది. గుండె ఆరోగ్యంంగా ఉండేందుకు ఎలాంటి ఆహారపు అలవాట్లకు దూరంగా ఉండాలో తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గుండెపోటు సమస్య గత కొద్దికాలంగా పెరుగుతోంది. గుండె పోటు రోగులు ఎక్కువౌతున్నారు. గుండె సంబంధిత వ్యాధులకు మనమే కారణమౌతున్నాం ఎందుకంటే ఆహారపు అలవాట్లు, ఆధునిక జీవనశైలి, నిత్యం ఒత్తిడి ఎదుర్కోవడం ఇందుకు ప్రధాన కారణాలు. హార్ట్ ఎటాక్ అనేది ప్రధానంగా హై కొలెస్ట్రాల్ కారణంగా వస్తుంది. రక్త నాళికల్లో బ్లాకేజ్ ఏర్పడి..రక్తాన్ని గుండెకు సరఫరా చేయడంలో ఒత్తిడి పెరుగుతుంది. ఫలితంగా హై బ్లడ్ ప్రెషర్ అనేది సంభవిస్తుంది. ఇక అక్కడి నుంచి హార్ట్ ఎటాక్, కొరోనరీ ఆర్టరీ డిసీజద్, ట్రిపుల్ వేసెల్ డిసీజ్ ఎదుర్కోవల్సి వస్తుంది. ఇది ప్రాణాంతకం కావచ్చు.


సిగరెట్ స్మాకింగ్, మద్యపానం


సిగరెట్, మద్యం అనేవి ఊపిరితిత్తులు, లివర్‌లను పాడు చేస్తాయి. అంతేకాకుండా గుండెపై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తాయి. ఎందుకంటే సిగరెట్, మద్యం కారణంగా హై బీపీ, హార్ట్ ఫెయిల్యూర్ సమస్యలు ఎదురౌతాయి. ఈ అలవాట్లను సాధ్యమైనంత త్వరగా వదిలేయాలి.


సాఫ్ట్‌డ్రింక్స్, ఆయిలీ ఫుడ్స్


అలసటగా ఉన్నప్పుడు లేదా దాహం వేసినప్పుడు చాలామంది సాఫ్ట్‌డ్రింక్స్ తాగుతుంటారు. ఇందులో సోడా మోతాదు ఎక్కువగా ఉండటం వల్ల గుండెకు నష్టం కల్గిస్తుంది. తరచూ తాగడం మంచిది కాదు. హార్ట్ ఎటాక్ ముప్పు పెరుగుతుంది. ఇక మరో చెడు అలవాటు ఆయిలీ ఫుడ్స్ తీసుకోవడం. మనదేశంలో ఆయిలీ ఫుడ్స్ ప్రభావం ఎక్కువే. రుచి బాగున్నా..ఆరోగ్యానికి మాత్రం మంచిది కాదు. వీటివల్ల రక్తంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. హార్ట్ ఎటాక్‌కు దారి తీస్తుంది. అందుకే ఆయిలీ ఫుడ్స్, ఫాస్ట్‌ఫుడ్స్, జంక్‌ఫుడ్స్ మానేయాలి. 


ప్రోసెస్డ్ మీట్


ప్రస్తుతం ప్రోసెస్డ్ మీట్ వాడకం ఎక్కువౌతుంది. చాలామంది ప్రోటీన్ల కోసం ప్రోసెస్డ్ మీట్ తీసుకుంటున్నారు. ఇందులో ఉప్పు శాతం ఎక్కువగా ఉండటం వల్ల అధిక రక్తపోటుకు కారణమౌతుంది. ఫలితంగా హార్ట్ ఎటాక్ సమస్య ఎదురౌతుంది. 


Also read: Cholesterol Control Tips: మీరు రోజూ తీసుకునే ఆహారంతోనే.. శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook