Heart Attack: గుండెపోటు వచ్చినప్పుడు ముందుగా ఏం చేస్తే రోగి ప్రాణం నిలబడుతుంది.
Heart Attack: ఇండియాలో గుండె సంబంధిత వ్యాధుల సంఖ్య పెరిగిపోతోంది. ఎప్పుడు ఎవరికి ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి. గుండెపోటు వస్తే ప్రాణం కాపాడేందుకు తక్షణం ఏం చేయాలనేది తెలుసుకుందాం.
Heart Attack: ఇండియాలో గుండె సంబంధిత వ్యాధుల సంఖ్య పెరిగిపోతోంది. ఎప్పుడు ఎవరికి ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి. గుండెపోటు వస్తే ప్రాణం కాపాడేందుకు తక్షణం ఏం చేయాలనేది తెలుసుకుందాం.
ఇటీవలి కాలంలో గుండెపోటు ముప్పు అధికమౌతోంది. ప్రతియేటా 2 కోట్ల మంది కేవలం గుండె సంబంధిత వ్యాధులతో మరణిస్తున్నారని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఈ ఏడాది దేశంలో ప్రముఖ వ్యక్తులు చాలామంది గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి చూశాం. మనకు తెలిసిన బంధువులు, స్నేహితులు కూడా చాలామంది హఠాత్తుగా గుండెపోటు రావడం, ప్రాణాలు కోల్పోవడం తెలుసు. ఈ క్రమంలో గుండెపోటు వచ్చినప్పుడు ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది పరిశీలిద్దాం..
గుండె ధమని అంటే కొరోనరీ ఆర్టరీలో ప్లఫ్ పేరుకుపోవడం వల్ల రక్త సరఫరాలో ఇబ్బంది తలెత్తుతుంది. ఫలితంగా గుండెకు రక్తం సరఫరా కాక గుండెపోటు వస్తుంది. ఎవరికైనా గుండెపోటు వచ్చినప్పుుడు ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు కొద్దిగా సమయం పడుతుంది. ఈ క్రమంలో ఇంట్లోనే ప్రాధమిక చికిత్స చాలా అవసరం. ఛాతీకి సరిగ్గా మధ్య భాగంలో గట్టిగా నొక్కాలి. సరిగ్గా సెంటర్ పాయింట్‌లో గట్టిగా ప్రెస్ చేయడం వల్ల శ్వాస వస్తుంది. రోగిని స్పృహలో తెచ్చేందుకు 1 నిమిషంలో 100-120 సార్లు ఇలా చేస్తారు. అదే సమయంలో సాధ్యమైనంత త్వరగా రోగిని ఆసుపత్రికి తీసుకెళ్లాలి. ఈ ప్రక్రియనే సీపీఆర్ అంటారు. సకాలంలో ఇలా చేస్తే రోగి ప్రాణాలు కాపాడవచ్చు.
హార్ట్ ఎటాక్ సమస్యకు ప్రధానమైన కారణం చెడు ఆహారపు అలవాట్లు, చెడు లైఫ్‌స్టైల్. హార్ట్ ఎటాక్ రోగి ఆహారం ఆరోగ్యంగా ఉండటం చాలా అవసరం. కొలెస్ట్రాల్ పెరిగే ఎలాంటి ఆహారం ఇవ్వకూడదు. దీనివల్ల ముప్పు పెరుగుతుంది. ఫ్రైడ్ పదార్ధాలు, మసాలా తిండి, ఫాస్ట్‌ఫుడ్, ఫ్యాటీ ఆహారం, మద్యపానం, ధూమపానం, ప్రోసెస్డ్ ఫుడ్, రెడ్ మీట్‌లకు దూరంగా ఉండాలి.
గుండెపోటు వచ్చినప్పుడు సాధారణంగా యాంజియోప్లాస్టీ లేదా బైపాస్ సర్జరీ చేస్తుంటారు. యాంజియోప్లాస్టీలో బ్లాక్ అయిన వెస్సెల్స్ శుభ్రం చేస్తారు. ఫలితంగా రక్త సరఫరా మెరుగౌతుంది. హార్ట్ ఎటాక్ వచ్చిన 1-2 గంటల్లోనే యాంజియోప్లాస్టీ చేయించాల్సి ఉంటుంది. ఆ తరువాత కనీసం 48 గంటలు ఆసుపత్రిలోనే ఉండాలి. చాలా సందర్భాల్లో యాంజియాప్లాస్టీ తరువాత కొరోనరీ ఆర్టరీలో స్టెంట్ వేస్తారు. ఇది రక్త నాళికలు కుదించుకుపోకుండా చేస్తుంది. ఫలితంగా రక్త సరఫరా మెరుగౌతుంది.
Also read: Belly Fat Lose Tips: పొట్ట చుట్టూ కొవ్వుకు ఇలా సులభంగా చెక్ పెట్టొచ్చు..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook