Heart Attack Symptoms: భారత్‌లో గుండెపోటు కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఫిట్‌నెస్‌పై అవగాహన ఉన్నప్పటికీ గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోతున్న సంగతి తెలిసిందే. ఇది రావడానికి పెద్ద కారణం శరీరంలో చెడు కొలెస్ట్రాల్ విచ్చల విడిగా పెరగడం. అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించకపోతే తీవ్ర గుండెపోటుకు గురయ్యే అవకాశాలున్నాయి. గుండెపోటు రాకుండా ఉండాలంటే కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఆహారాల్లో పలు రకాల నియమాలు పాటించడం వల్ల కూడా అనారోగ్య సమస్యలకు చెక్‌ పెట్టొచని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి:
శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ పెరడానికి ప్రధాన కారణాలు అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం వల్లేనని నిపుణులు తెలుపుతున్నారు. అయితే శరీరంలో కొలెస్ట్రాల్‌ అదుపులో ఉంటేనే అనారోగ్య సమస్యలు రావు. కాబట్టి దీని కోసం విత్తనాలు గల ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా అధికంగా పోషకాలు ఉండే అవిసె గింజలను ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఫైబర్, ఒమేగా-3, ఒమేగా 6 కొవ్వు ఆమ్లాలు, కరిగే ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు లభిస్తాయి. ఇవి అనారోగ్య సమస్యల నుంచి శరీరాన్ని కాపడడమేకాకుండా శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌కు చెక్‌ పెడతాయి. అవిసె గింజల్లో ఉండే లిన్సీడ్‌ పోషకాలు రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి.


అవిసె గింజలను ఎలా వినియోగించాలి:
అధిక కొలెస్ట్రాల్‌ సమస్యలతో బాధపడుతున్నవారు రోజువారీ ఆహారంలో అవిసె గింజలను తప్పకుండా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే వీటిని నీటిలో నానబెట్టి వేయించి తీసుకుంటే రెట్టింపు ప్రయోజనాలు పొందుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.


ఈ విషయాలను గుర్తుంచుకోండి:
లిన్సీడ్‌లో చాలా పోషకాలు ఉంటాయి. కానీ ఇవి కొంతమందికి హాని కలిగించే అవకాశాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి వీటిని అతిగా తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వీటిని అతిగా తీసుకుంటే అలర్జీ,  వాపు సమస్య వచ్చే అవకాశాలున్నాయి.  కాబట్టి వీటిని తప్పకుండా శరీరానికి అవసరమైనంతనే తీసుకోవాల్సి ఉంటుంది.


(NOTE: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


 


Also Read: Chiru Vs Balayya: అన్ని విషయాల్లో బాలయ్యను డామినేట్ చేస్తున్న చిరు.. ఆ దెబ్బతో సినిమా కూడా ముందే?


Also Read: Samantha Hugs: అతని కౌగిట్లో సమంత.. ఈరోజు వస్తుందని ఊహించలేదంటూ పోస్ట్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook