Heart Attack vs Heart Failure: గుండెపోటు..ఇటీవలి కాలంలో ఈ పదం చాలా భయపెడుతోంది. హార్ట్ ఎటాక్ వచ్చిందనో లేదా హార్ట్ ఫెయిల్యూర్ అనో వింటున్నాం. అసలీ రెండింటికీ మధ్య తేడా ఏంటి, ఈ రెండింట్లో కన్పించే ఆరోగ్య పరిస్థితి ఏంటనేది తెలుసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే అప్పుడే సరైన చికిత్స అందించగలం. ఇది మీ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. రెండూ గుండెకు సంబంధించినవే అయినా తేడా మాత్రం చాలా ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హార్ట్ ఎటాక్ అంటే ఏమిటి


హార్ట్ ఎటాక్‌ను మరో మాటలో మయోకార్డియల్ ఇన్‌ఫెక్షన్ అని కూడా పిలుస్తారు. గుండెకు తగిన మోతాదులో రక్తం సరఫరా కానప్పుడు గుండెపోటు లేదా హార్ట్ ఎటాక్ సంభవిస్తుంది. అంటే గుండెలో ఉండే సెల్స్ లేదా కండరాలు జీవించి ఉండాలంటే అవసరమైన ఆక్సిజన్ సరఫరా కావాలి. ఆక్సిజన్ సరైన మోతాదులో అందనప్పుడు వెంటనే చికిత్స చేయించకపోతే ఆ వ్యక్తి ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది. గత కొద్దికాలంగా హార్ట్ ఎటాక్ కేసులు కేవలం వృద్ధుల్లోనే కాకుండా యువకుల్లో కూడా కన్పిస్తోంది. అంటే ఆరోగ్యంగా ఉండేవాళ్లలో కూడా ఇదే సమస్య ఉంటోంది. 


హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఏమిటి


హార్ట్ ఫెయిల్యూర్ లేదా గుండె విఫలమవడం అంటే గుండె సరిగ్గా పనిచేయకపోవడమే. సులభంగా చెప్పాలంటే రక్తాన్ని శరీరంలోని వివిధ భాగాలకు పంపింగ్ చేసే సామర్ధ్యం తగ్గిపోవడం. గుండె చేసే ప్రధాన విధి శరీరంలోని వివిధ భాగాలకు రక్తాన్ని సరఫరా చేయడం. గుండె ఈ పని చేయలేనప్పుడు హార్ట్ ఫెయిల్యూర్ అంటారు.


హార్ట్ ఎటాక్, హార్ట్ ఫెయిల్యూర్ కారణాలు


హార్ట్ ఎటాక్, హార్ట్ ఫెయిల్యూర్ రెండూ వేర్వేరు స్థితులు. అందుకే ఈ రెండింటికీ కారణాలు కూడా వేర్వేరుగానే ఉంటాయి. ఆ కారణాలేంటో తెలుసుకుందాం..


హార్ట్ ఎటాక్‌కు దారితీసే కారణాలు


ఒత్తిడి, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, చెడు ఆహారపు అలవాట్లు, అధిక రక్తపోటు, డయాబెటిస్, ఆటో ఇమ్యూన్ కండీషన్,  కొరోనరీ ఆర్టరీ డిసీజెస్, కుటుంబంలో హార్ట్ ఎటాక్ చరిత్ర


హార్ట్ ఫెయిల్యూర్ కారణాలు


గుండె వాల్వ్ సామర్ధ్యం దెబ్బతినడం, నిద్రలో శ్వాస ఆగడం లేదా స్లీప్ యాప్నియా, మధుమేహం, ఊపిరితిత్తుల్లో బ్లడ్ క్లాట్స్, గుండె కండరాల్లో వాపు, ధూమపానం, మద్యపానం


చికిత్స ఏంటి


హార్ట్ ఎటాక్ స్థితిలో తక్షణం యాంజియోప్లాస్టీ చేయడం ద్వారా బ్లాకేజ్ దూరం చేస్తారు. ఫలితంగా గుండె వరకూ రక్త సరఫరా మెరుగుపడుతుంది. గుండె కండరాలు సజీవంగా ఉంటాయి. మరోవైపు హార్ట్ ఫెయిల్యూర్ మేనేజ్ చేసేందుకు కొన్ని మందుల్ని వినియోగించాల్సి ఉంటుంది. వీటితో రక్తపోటును నియంత్రించవచ్చు. రక్త సరఫరాను మెరుగుపర్చే మందులిస్తారు. వీటిని ఏస్ ఇన్‌హిబిటర్స్ అంటారు. ఇవి కాకుండా బీటా బ్లాకర్ అంటే బ్లడ్ ప్రెషర్ తగ్గించేందుకు లేదా గుండె వేగాన్ని తగ్గించేం మందులు కూడా ఇస్తారు.


Also read: Skin Care Juices: రోజూ ఈ జ్యూస్‌లు తాగితే..వేసవి నుంచి రక్షణ, నిగనిగలాడే అందం మీ సొంతం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook