Skin Care Juices for Summer: రోజూ ఈ జ్యూస్‌లు తాగితే.. వేసవి నుంచి రక్షణ, నిగనిగలాడే అందం మీ సొంతం

వేసవి వచ్చేసింది. చలికాలంలో ఉన్నట్టే చర్మ సంరక్షణ వేసవిలో కూడా చాలా అవసరం. వేసవిలో చర్మం ట్యానింగ్, నిగారింపు కోల్పోవడం, డ్రైగా మారడం వంటి సమస్యలు ఎదుర్కొంటుంది. ఈ సమస్యల్నించి ఉపశమనం పొందాలంటే రోజూ ఈ డ్రింక్స్ తప్పనిసరిగా తీసుకోవల్సిందే. వీటివల్ల మీ అందం పెరిగి యౌవనంగా కన్పించడమే కాకుండా చర్మం నిగారింపు తెచ్చుకుంటుంది. 

Skin Care Juices: వేసవి వచ్చేసింది. చలికాలంలో ఉన్నట్టే చర్మ సంరక్షణ వేసవిలో కూడా చాలా అవసరం. వేసవిలో చర్మం ట్యానింగ్, నిగారింపు కోల్పోవడం, డ్రైగా మారడం వంటి సమస్యలు ఎదుర్కొంటుంది. ఈ సమస్యల్నించి ఉపశమనం పొందాలంటే రోజూ ఈ డ్రింక్స్ తప్పనిసరిగా తీసుకోవల్సిందే. వీటివల్ల మీ అందం పెరిగి యౌవనంగా కన్పించడమే కాకుండా చర్మం నిగారింపు తెచ్చుకుంటుంది. 

1 /5

టొమాటో జ్యూస్ రోజూ తీసుకోవడం వల్ల చర్మం యౌవనంగా, కాంతివంతంగా ఉంటుంది. టొమాటోను సలాడ్ రూపంలో కూడా తీసుకోవచ్చు.

2 /5

దానిమ్మ జ్యూస్‌లో విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. దానిమ్మ జ్యూస్ సేవించడం ద్వారా చర్మంలో నిగారింపు వస్తుంది. ముఖంలో కాంతి వస్తుంది. అయితే రోజూ క్రమం తప్పకుండా తీసుకోవాలి.

3 /5

ఆరెంజ్ జ్యూస్‌లో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు దోహదం చేస్తుంది. క్రమం తప్పకుండా తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి.

4 /5

గ్రీన్ టీ అనేది కేవలం బరువు తగ్గించేందుకే కాకుండా చర్మ సంరక్షణకు అద్భుతంగా పనిచేస్తుంది. రోజుకు రెండుసార్లు గ్రీన్ టీ తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి

5 /5

బీట్‌రూట్ జ్యూస్ ఆరోగ్యానికి అద్భుత ఔషధంగా పనిచేస్తుంది. రోజూ తీసుకోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.