Heart Care Tips: గుండెపోటు అన్నింటికంటే ప్రమాదకరం. సాధారణంగా గుండెపోటు మూడు సందర్భాల్లో హెచ్చరిస్తుందంటారు. తొలిసారి హార్ట్ ఎటాక్ వచ్చిన తరువాత కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే..ఆ ముప్పును దూరం చేయవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సాధారణంగా గుండెపోటు వచ్చేముందు కొన్ని లక్షణాలు కన్పిస్తుంటాయి. ఛాతీలో నొప్పి, తీవ్రమైన అలసట, శరీరం ఎడమవైపు భాగం లాగడం లేదా నొప్పి ఇలా రకరకాలుగా ఉంటుంది. మరోవైపు గుండెపోటు అనేది మూడు సందర్భాలుగా హెచ్చరిక చేస్తుందంటారు. అంటే మొదటిసారి, రెండవసారి తరువాత చివరిసారి. కొందరికి మాత్రం మొదటి హెచ్చరికలోనే ప్రాణాలు పోతాయి. అయితే మొదటిసారి హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే..రెండవసారి గుండెపోటు వచ్చే అవకాశాలు తగ్గుతాయంటున్నారు వైద్యులు. ఆ జాగ్రత్తలేంటో చూద్దాం..


మొదటిసారి గుండెపోటు తరువాత తీసుకోవల్సిన జాగ్రత్తలు


సాధారణంగా ఉప్పు ఎక్కువగా తినేవారిలో గుండెపోటు ప్రమాదం ఎప్పుడూ పొంచి ఉంటుంది. ఆరోగ్యంగా ఉండాలంటే ఉప్పు తక్కువ మోతాదులో తీసుకుంటే మంచిది. ముందునుంచే గుండె సమస్య ఉంటే మాత్రం ఉప్పు సాధ్యమైనంతవరకూ మానేయాలి. లేదా అతి కొద్దిగా తీసుకోవాలి. 


హార్ట్ ఎటాక్ వచ్చిన తరువాత విశ్రాంతి తీసుకోవడం ఎట్టి పరిస్థితుల్లోనూ మంచిది కాదు. ఇలా చేయడం వల్ల చాలా సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. అందుకే మొదటిసారి హార్ట్ ఎటాక్ అయినప్పుడు ఫిజికల్ యాక్టివిటీ పెంచాలి. తేలికపాటి వ్యాయామం, వాకింగ్, సైక్లింగ్ వంటివి అలవాటు చేసుకోవాలి. 


హార్ట్ ఎటాక్ తరువాత మీరు పనిచేసే చోట ఒత్తిడి, ఆందోళన లేకుండా ఉండేట్టు చూసుకోవాలి. పని ఒత్తిడి అస్సలు మంచిది కాదు. మీరు పనిచేసే పద్ధతులు మార్చుకోవాలి.


మొదటిసారి హార్ట్ ఎటాక్ అనంతరం డైట్‌లో మార్పులు చాలా అవసరం. ముఖ్యంగా చాకొలేట్స్. పంచదార, స్వీట్స్ వంటివాటికి దూరంగా ఉండాలి. వీటివల్ల కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది. దాంతోపాటు బరువు కూడా పెరుగుతారు. ఇది గుండెకు మరింత ముప్పుగా మారుతుంది. 


Also read: Green Tea Side Effects: అతిగా గ్రీన్ టీ తాగితే వచ్చే అనారోగ్య సమస్యలేంటో తెలుసా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook