Heart Patient: హార్ట్ పేషెంట్స్ వీటిని అస్సలు తినకూడదు.. ఇక తింటే అంతే సంగతి..!
Heart Patient: ఆహారం, ఆరోగ్యానికి చాలా దగ్గరి సంబంధం ఉంది. అందుకే మీరు ఏది తిన్నా అది నేరుగా మీ శరీరంపై ప్రభావం చూపుతుంది. మారుతున్న జీవన శైలి కారణంగా ప్రజలు అనేక రకాల ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు.
Heart Patient: ఆహారం, ఆరోగ్యానికి చాలా దగ్గరి సంబంధం ఉంది. అందుకే మీరు ఏది తిన్నా అది నేరుగా మీ శరీరంపై ప్రభావం చూపుతుంది. మారుతున్న జీవన శైలి కారణంగా ప్రజలు అనేక రకాల ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. ముఖ్యంగా ఇదే క్రమంలో గుండె సంబంధిత సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. దీని వెనుక ఉన్న ప్రధాన కారణాలలో ఒకటి ఆహారం. నివేదికల ప్రకారం.. కొన్ని రకాల ఆహార నియమాలు పాటిస్తే.. గుండె సంబంధిత సమస్యలను నివారించవచ్చని నిపుణులు తెలుపుతున్నారు.
హార్ట్ పేషెంట్స్ తప్పకుండా ఈ నియమాలు పాటించండి:
ఎక్కువ ఉప్పును తిన కూడదు:
ఉప్పును అధిక మోతాదులో తీసుకుంటే అది శరీరంలో సోడియం స్థాయిని పెంచి.. రక్తపోటుకు కారణమవుతుంది. దీనితో పాటు గుండె స్పందన రేటు కూడా అధికంగా పెరుగుతుంది. అందుకే ఉప్పు తీసుకోవడం తగ్గించడం చాలా ముఖ్యం.
ఎక్కువగా ప్రాసెస్ చేసిన ధాన్యాలు తినవద్దు:
పాస్తా, వైట్ రైస్ మొదలైన వాటికి దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇవన్నీ గుండె జబ్బులకు మంచివి కావు. వీటిని తీసుకోవడం వల్ల గుండెకు సంబంధించిన సమస్యలు పెరగడమే కాకుండా మధుమేహం, కొలెస్ట్రాల్ వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి.
చక్కెర పదార్థాలు:
హార్ట్ పేషెంట్స్ చక్కెర పదార్థాలను తినకూడదు. ఎందుకంటే ఆ పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే.. రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. దీనితో గుండె సమస్యలు పెరుగుతాయి. ఈ రోగులు తీపి కోసం చక్కెరకు బదులుగా తేనెను వినియోగించవచ్చని నిపుణులు తెలుపుతున్నారు.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Benefits of Jamun Fruit: వేసవిలో నేరేడు తింటే స్పెర్మ్ కౌంట్ అమాంతం పెరుగుతుంది!
Also Read: Sprouts for Diabetes: మీకు డయాబెటిస్ ఉందా..? అయితే ఇది మీ కోసమే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి