Tips For Cleaning Fruits & Veggies: పండ్లు, కూరగాయలపై ఉండే రసాయణాలు తొలగాలంటే ఇలా చేయండి..!
Tips For Cleaning Fruits & Vegetables: మనం తినే చాలా పండ్లు, కూరగాయలలో పురుగు మందులు ఉండటం చాలా ఆందోళనకరమైన విషయం. ఈ పురుగు మందులను పూర్తిగా తొలగించకుండా తింటే అవి మన ఆరోగ్యానికి హానికరం. అందుకే, పండ్లు, కూరగాయలను ఇంట్లో శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం.
Tips for Cleaning Fruits & Vegetables: ఈ రోజుల్లో, చాలా వరకు పండ్లు, కూరగాయలను పెస్టిసైడ్స్ వాడేసి పండిస్తున్నారు. వాటిని పండించేటప్పుడు కూడా పురుగు మందులు వాడతారు. అలాంటి పండ్లు, కూరగాయలను శుభ్రంగా కడగకుండా తింటే, వాటి వల్ల కలిగే నష్టాలు లాభాల కంటే ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ పురుగు మందులను తొలగించడానికి, వాటిని ఇంట్లోనే శుభ్రం చేసుకోవడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి.
పండ్లు, కూరగాయలను శుభ్రం చేసుకోవడానికి కొన్ని చిట్కాలు:
మార్కెట్ నుంచి పండ్లు, కూరగాయలను తీసుకువచ్చిన వెంటనే ఒక గిన్నెలో నీటిని తీసుకొని, అందులో కొన్ని చుక్కల వెనిగర్ లేదా నిమ్మరసం కలపండి. ఆ నీటిలో పండ్లు, కూరగాయలను 15-20 నిమిషాలు నానబెట్టండి. తరువాత శుభ్రమైన నీటితో బాగా కడగండి. దీని వల్ల పండ్ల మీద ఉండే కెమికల్స్ తొలగిపోతాయి. పండ్లు, కూరగాయాలు తాజాగా శుభ్రంగా ఉండాలి అంటే ముందుగా ఒక గిన్నెలో నీటిని తీసుకొని, అందులో ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా కలపండి. ఆ నీటిలో పండ్లు, కూరగాయలను 5-10 నిమిషాలు నానబెట్టండి. తరువాత శుభ్రమైన నీటితో బాగా కడగండి.
చాలా మంది పండ్లలను తీసుకువచ్చిన వెంటనే ముక్కలు చేసుకొని తింటారు, కానీ అలా చేయడం వల్ల అనారోగ్య సమస్యలు కలుగుతాయి. ముందుగా ఒక గిన్నెలో నీటిని తీసుకొని, అందులో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు కలపండి. ఆ నీటిలో పండ్లు, కూరగాయలను 10-15 నిమిషాలు నానబెట్టండి. తరువాత శుభ్రమైన నీటితో బాగా కడగండి. దీని వల్ల పండ్ల మీద ఉండే మురికి తొలిగిపోతుంది. పండ్లును కూరగాయాలను శుభ్రం చేయడానికి మార్కెట్లో లభించే ఫ్రూట్ & వెజిటబుల్ వాష్ ను కూడా వాడవచ్చు. ఈ వాష్ లోని పదార్థాలు పురుగు మందులను తొలగించడంలో సహాయపడతాయి.
పండ్లు, కూరగాయలను శుభ్రం చేసుకునేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలు:
పండ్లు, కూరగాయలను శుభ్రం చేయడానికి వేడి నీటిని వాడకండి. వేడి నీరు పురుగు మందులను మరింత కరిగించి, పండ్లు, కూరగాయలలోకి వెళ్ళేలా చేస్తుంది. పండ్లు, కూరగాయలను శుభ్రం చేసేటప్పుడు స్కాచ్ ప్యాడ్ లాంటివి వాడకండి. ఇవి పండ్లు, కూరగాయల చర్మాన్ని దెబ్బతీస్తాయి. పండ్లు, కూరగాయలను శుభ్రం చేసిన తరువాత వెంటనే తినండి. ఎక్కువ సేపు నానబెట్టకండి.
చిట్కాలు:
పండ్లు, కూరగాయలను కొనుగోలు చేసిన వెంటనే వాటిని శుభ్రం చేసుకోవడం మంచిది.
వాటిని శుభ్రం చేయడానికి గోరువెచ్చని నీటిని ఉపయోగించండి.
శుభ్రం చేసిన తర్వాత వెంటనే పండ్లు, కూరగాయలను తినండి లేదా వాటిని రిఫ్రిజిరేటర్‌లో భద్రపరచండి.
ఈ చిట్కాలను పాటించడం ద్వారా పండ్లు, కూరగాయలపై ఉన్న రసాయనాలను తొలగించవచ్చు వాటిని సురక్షితంగా ఆస్వాదించవచ్చు.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి