Herbal Tea: పాలు, పంచదారతో తయారయ్యే సాధారణ టీ కంటే హెర్బల్ టీ ఆరోగ్యానికి అత్యంత మేలు చేస్తుంది. హెర్బల్ టీ ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ పరిమితి మించకూడదంటున్నారు ఆరోగ్య నిపుణులు. పుదీనా టీ మోతాదు దాటి తాగితే చాలా ఇబ్బందులు ఎదుర్కోవల్సివస్తుంది. ఈ క్రమంలో హెర్బల్ టీ తీసుకునే విషయంలో పాటించాల్సిన సూచనలేంటో తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పుదీనా టీ ఎక్కువైతే కలిగే నష్టాలు


జీర్ణ సంబంధిత సమస్యలున్నవాళ్లకు పుదీనా టీ అంత మంచిది కాదనే చెప్పాలి. దీనివల్ల జీర్ణక్రియపై చెడు ప్రభావం పడుతుంది. ఎందుకంటే పుదీనాలో ఉండే మెంథాల్ కడుపు సమస్యల్ని పెంచుతుంది.


గర్భిణీ మహిళలు ఎట్టి పరిస్థితుల్లోనూ పెప్పర్‌‌మింట్ టీ అంటే పుదీనా టీకు దూరంగా ఉండాలి. ఎందుకంటే పుదీనా టీ గర్భిణీ మహిళలకు హాని కల్గిస్తుంది. పుదీనా టీలో ఉండే ఆయిల్ గర్భాశయంలో రక్త సరఫరాను పెంచుతుంది. దాంతో అబార్షన్ ముప్పు ఉండవచ్చు.


కిడ్నీ సమస్యలున్నవారు పుదీనా టీకు దూరంగా ఉండాలి. ఎందుకంటే పుదీనా టీ తాగడం వల్ల లాభాలకు బదులు హాని కలుగుతుంది. కిడ్నీ వ్యాధి సమస్య ఉన్నవాళ్లు పుదీనా టీకు దూరం పాటించాల్సి ఉంటుంది. 


అవసరానికి మించి పుదీనా టీ తాగితే బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ ముప్పు పలు రెట్లు పెరిగిపోతుంది. అందుకే వివిధ రకాల అనారోగ్య సమస్యలున్నవాళ్లు వైద్యుడి సలహా మేరకే పుదీనా టీ తీసుకోవాలి.


Also read: Holi 2023 Precautions: మీరు ఆస్తమా ఉందా, అయితే హోలీ రోజు తస్మాత్ జాగ్రత్త



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook