Holi 2023 Precautions: మీకు ఆస్తమా ఉందా, అయితే హోలీ రోజు తస్మాత్ జాగ్రత్త

Holi 2023 Precautions: హోలీ. మరికొద్ది రోజుల్లోనే దేశం హోలీ సంబరాల్లో మునిగిపోనుంది. అందరూ హోలీ రంగుల్లో ఆనందంతో మునిగితేలుతారు. మరి వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడేవారి పరిస్థితి ఏంటి, ముఖ్యంగా ఆస్తమా రోగులు ఎలా ఉండాలి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇప్పుడు తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 5, 2023, 03:44 PM IST
Holi 2023 Precautions: మీకు ఆస్తమా ఉందా, అయితే హోలీ రోజు తస్మాత్ జాగ్రత్త

హిందూమత విశ్వాసాల ప్రకారం దీపావళి తరువాత అత్యంత ఘనంగా జరుపుకునే పండుగ హోలీ. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ పండుగ జరుపుకుంటారు. ఒకరిపై మరొకరు రంగులు పూసుకుంటూ హోలీ శుభాకాంక్షలు చెప్పుకుంటారు. ఇళ్లలో చేసుకునే వంటల్ని ఒకరికొకరు షేర్ చేసుకుంటారు. అయితే ఆస్తమా రోగులు హోలీ చాలా సమస్యల్ని తెచ్చిపెట్టవచ్చు. హోలీ వేడుకల్లో ఆస్తమా రోగులు గులాల్ తీసుకున్నా లేదా రంగులు పొరపాటున పీల్చుకున్నా ఆస్తమా ఎటాక్ రావచ్చు. అందుకే ఆస్తమా రోగులు హోలీ నాడు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. లేకపోతే భారీ మూల్యం చెల్లించుకోకతప్పదు.

ఆస్తమా రోగులు పాటించాల్సిన జాగ్రత్తలు

ఆస్తమా సమస్య ఉన్నవాళ్లు హోలీ నాడు దుమ్ము ధూలి, రంగులు, రంగు నీళ్లు, గులాల్ నుంచి దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రంగుల్లేకుండా చూసుకోవాలి. రంగులు, గులాల్‌తో వేడుక జరుపుకుంటే ఆస్తమా ఎటాక్ ముప్పు పెరిగిపోతుంది. దాంతో ఆరోగ్యం వికటించవచ్చు.

ఇన్‌హేలర్ తప్పనిసరి

హోలీ రోజున ఆస్తమా రోగులు తమ వెంట ఇన్‌హేలర్ తప్పనిసరిగా ఉంచుకోవాలి. పండుగ రోజున రంగులు, గులాల్ కారణంగా శ్వాస ఇబ్బంది రావచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఇన్‌హేలర్ వెంట ఉంటే తక్షణం ఉపశమనం పొందేందుకు అవకాశముంటుంది. లేకపోతే ఆరోగ్యం దెబ్బతినవచ్చు.

ఆస్తమా రోగులు హోలీ రోజున డ్రై పౌడర్‌కు పూర్తిగా దూరంగా ఉండాలి. ఎందుకంటే రంగుల్లో ఉండే కణాలు నేరుగా గాలితో కలిసిపోతాయి. గాలి ద్వారా రోగుల ఊపిరితిత్తుల్లో ప్రవేశిస్తే శ్వాస సంబంధ వ్యాధులు తలెత్తుతాయి. 

Also read: Detox Foods: శరీరాన్ని ఎందుకు డీటాక్స్ చేయాలి, డీటాక్స్ చేసే పద్ధతులేంటి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News