Hibiscus Tea Health Benefits: మందార టీ ఆరోగ్యానికి ఓ వరం.. చలికాలంలో తాగితే అద్భుతమైన ప్రయోజనాలు! బరువు తగ్గడమే కాదు
Here is 6 Health Benefits to Drinking Hibiscus Tea. మందార పూలతో టీ తయారు చేసి తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. రకరకాల శారీరక ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ పొందవచ్చు.
Drinking Hibiscus Tea in Winter has Amazing Benefits: భారత దేశంలో 'మందార పువ్వు'కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. దీనినే జైసెన్ పువ్వు అని కూడా అంటారు. మందార పువ్వును హిందువులు ఎక్కువగా పూజలో ఉపయోస్తారు. మందార పువ్వు జడలో ఉంటే.. ఆడవారు మరింత సౌందర్యంగా ఉంటారు. అంతేకాదు మందార పువ్వు పలు రకాల తీవ్రమైన వ్యాధులను సైతం నయం చేస్తుంది. మందార పూలతో టీ తయారు చేసి తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. పూర్వకాలం నుంచే ఎన్నో ఆయుర్వేద మందుల్లో మందారను వాడుతున్న విషయం తెలిసిందే.
మందార పువ్వులు ఎరుపు, పసుపు, తెలుపు లేదా పీచు రంగులలో ఉంటాయి. మందార పూవ్వు రేకులు, ఆకులను ఎండబెట్టి.. వాటితో టీ తయారు చేయాలి. హెర్బల్ మందార టీ కొద్దిగా పుల్లని రుచి కలిగి ఉన్నా.. ప్రపంచ వ్యాప్తంగా చాలా ఫేమస్. ఈ మందార పూలతో టీ తయారు చేసి తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మందార టీలో విటమిన్ సీ, విటమిన్ ఏతో పాటు జింక్, ఇతర ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. మందారలో ఉండే యాంటీ యాక్సిడెంట్లు, విటమిన్ సీ జట్టుకు ఎంతో మేలు చేస్తాయి. ఇవే కాదు మందారతో ఇంకా ఎన్నో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.
శారీరక ఇన్ఫెక్షన్స్:
మందార పువ్వులు యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ మరియు యాంటీపరాసిటిక్ లక్షణాలను కలిగి ఉంటాయి. అందుకే మందార పువ్వులతో చేసిన టీని తీసుకుంటే.. బ్యాక్టీరియా, ఫంగల్ మరియు ఇతర రకాల శారీరక ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ పొందవచ్చు.
చెడు కొలెస్ట్రాల్:
గుండెకు చెడు కొలెస్ట్రాల్ చాలా ప్రమాదకరం. మందారలో ఉండే యాంటీఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడతాయి. దీనితో పాటు మందార పువ్వుతో తయారు చేసిన హెర్బల్ టీ రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
మధుమేహం:
మందార ఆకులలోని ఇథనాల్ సారం యాంటీ డయాబెటిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. మందార టీ తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. డయాబెటిస్‌లో మందార ప్రయోజనకరంగా ఉంటుంది.
బరువు:
బరువు తగ్గాలనుకునే వారు మందార టీని తీసుకోవచ్చు. మందార టీలో అమైలేస్ ఎంజైమ్‌లు ఉంటాయి. దీని కారణంగా శరీరంలోని చక్కెర మరియు స్టార్చ్ పరిమాణం నియంత్రించబడుతుంది. మందార టీ బరువును తగ్గించడంలో సహాయపడుతుంది.
ఒత్తిడి:
మందారలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మానసిక సమస్యలకు మేలు చేస్తాయి. మందారతో చేసిన టీ తాగడం వల్ల మంచి నిద్ర వస్తుంది. ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ టీ తాగడం వల్ల మానసిక స్థితి కూడా మెరుగుపడుతుంది.
జుట్టు:
మందారలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. మినరల్స్ పుష్కలంగా ఉన్న మందార టీ.. జుట్టును బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుంది.
మందార టీని ఇలా తెయారు చేయండి:
ముందుగా మందార పూవ్వు రేకులు, ఆకులను ఎండబెట్టాలి. చల్లటి నీటిలో మందారం పొడి రేకులను వేసి 2 గంటలు నానబెట్టండి. అనంతరం ఈ నీటిని పాత్రలో పోసి స్టౌ మీద మరిగించండి. ఆపై నీటిని వడకట్టి.. నిమ్మరసం, చక్కర లేదా తేనే వేసుకుని టీ చేయాలి. ఇష్టమైన వారు దాల్చిన చెక్క లేదా పుదీనా ఆకులూ వేసుకుని తాగవచ్చు.
Also Read: రూపాయి కాయిన్‌లతోనే.. 2.85 లక్షల విలువైన కేటీఎం బైక్ కొన్న తెలంగాణ యువకుడు! షాకింగ్ వీడియో మీ కోసం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.