రూపాయి కాయిన్‌లతోనే.. 2.85 లక్షల విలువైన కేటీఎం బైక్ కొన్న తెలంగాణ యువకుడు! షాకింగ్ వీడియో మీ కోసం

Telangana man buys dream bike of Rs 2.8 lakh with one rupee coins. తెలంగాణలోని మంచిర్యాల ప్రాంతానికి చెందిన వెంకటేశ్ అనే యువకుడు కేటీఎం స్పోర్ట్స్ బైక్ కొనడానికి మొత్తం రూపాయి కాయిన్‌లనే సేకరించాడు.   

Written by - P Sampath Kumar | Last Updated : Dec 19, 2022, 01:17 PM IST
  • రూపాయి కాయిన్‌లతోనే
  • 2.85 లక్షల కేటీఎం బైక్ కొన్న యువకుడు
  • షాకింగ్ వీడియో మీ కోసం
రూపాయి కాయిన్‌లతోనే.. 2.85 లక్షల విలువైన కేటీఎం బైక్ కొన్న తెలంగాణ యువకుడు! షాకింగ్ వీడియో మీ కోసం

Telangana Student Venkatesh buy 2.85 Lakhs KTM Bike with 112 Bags Of 1 Rupee Coins: యువతకు బైక్‌లపై ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నచ్చిన బైక్ కొనడానికి ఎంత కష్టమైనా పడుతున్నారు. తాజాగా ఓ యువకుడు కూడా కేటీఎం స్పోర్ట్స్ బైక్ కొనేందుకు చాలా కష్టపడ్డాడు. అయితే అతడు బైక్ కొనడానికి ఉపయోగించిన విధానమే నెట్టింట చర్చకు దారితీసింది. ఆ యువకుడు అందరిలా డిజిటల్ పేమెంట్ చేయలేదు.. నోట్ క్యాష్, చెక్ కూడా ఇవ్వలేదు. కేవలం రూపాయి కాయిన్‌లతోనే  2.85 లక్షల విలువైన కేటీఎం బైక్ కొన్నాడు. వివరాల్లోకి వెళితే... 

వివరాల ప్రకారం... తెలంగాణలోని మంచిర్యాల ప్రాంతానికి చెందిన వెంకటేశ్ అనే వ్యక్తి పాలిటెక్నిక్ విద్యార్థి. అతడికి కేటీఎం స్పోర్ట్స్ బైక్ అంటే చాలా ఇష్టం. తనకు ఇష్టమైన బైక్ కొనడానికి మొత్తం రూపాయి కాయిన్‌లనే సేకరించాడు. రూ. 2.85 లక్షల నాణేలను 112 బ్యాగులలో నింపాడు. ఒక్కో బ్యాగులో (ఒక్కొక్క సంచిలో 2,500 రూపాయి నాణేలు) ఎంత ఉందో అని స్టిక్కర్స్ కూడా అతికించాడు. ఈ 112 బ్యాగులను ఓ ట్రాలీలో వేసుకుని కేటీఎం షో రూమ్‌కు వెళ్లాడు. ఇది చూసిన కేటీఎం షో రూమ్‌ మేనేజర్ సహా అక్కడున్న సిబ్బంది మొత్తం ఒక్కసారిగా షాక్ అయ్యారు.

కేటీఎం షో రూమ్‌ సిబ్బంది మొదట్లో వెంకటేష్ తెచ్చిన రూపాయి నాణేల బ్యాగులను చెల్లింపుగా తీసుకునేందుకు ఒప్పుకోలేదు. ఆపై స్పోర్ట్స్ బైక్‌లపై యువకుడికి ఉన్న మక్కువ గురించి తెలుసుకుని ఒప్పుకున్నారు. నాణేలు తీసుకుని బైక్ డెలివరీ చేశారు. అయితే నాణేలను లెక్కించడానికి కేటీఎం షో రూమ్‌ సిబ్బందికి సగం రోజు పట్టిందట. రూపాయి నాణేలను లెక్కపెట్టడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందట. ఇందుకు సంబంధించిన వీడియో 'విలన్ మామా గేమింగ్' యూట్యూబ్ ఛానల్‌లో అప్లోడ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నాణేలు చూసిన అందరూ షాక్ అవుతున్నారు. 

తనకు ఇష్టమైన కేటీఎం డ్యూక్ 250 బైక్ కొనాలని చాలా రోజుల నుంచి అనుకున్నట్లు పాలిటెక్నిక్ విద్యార్థి వెంకటేష్ వీడియోలో చెప్పాడు. బైక్ చిన్నప్పటి నుంచి 40,000 రూపాయి నాణేలను కూడబెట్టాడని అతడు చెప్పాడు. మిగిలిన మొత్తాన్ని కొన్ని బ్యాంకులను సంప్రదించి వెంకటేష్ చెప్పాడు. తనకు ఇష్టమైన బైకుని రూపాయి నాణేలతో కొనాలని గట్టిగా అనుకోవడం వల్లనే ఇది సాధ్యమయిందని ఆ కుర్రాడు పేర్కొన్నాడు. 

Also Read: iPhone 13 Price Flipkart: ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్.. ఐఫోన్ 13పై 27 వేల బంపర్ ఆఫర్! మరో రెండు రోజులే   

Also Read: FIFA World Cup 2022 Prize Money: ఫిఫా ప్రపంచకప్ 2022 విజేతకు ఊహించని ప్రైజ్‌మనీ.. తెలిస్తే షాకే! అవార్డుల లిస్ట్ ఇదే  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

 

Trending News