Here is natural home remedies for Hiccups: మనిషికి ఎక్కిళ్లు రావడం సర్వసాధారణం. కొన్నిసార్లు ఎక్కిళ్లు వస్తే త్వరగానే తగ్గిపోతాయి. మరికొన్నిసార్లు మాత్రం ఎక్కిళ్లు ఆపడం కష్టం అవుతుంది. ఎవరైనా మనల్ని గుర్తుచేసుకునప్పుడు ఎక్కిళ్లు వస్తాయని చాలా మంది నమ్ముతారు. అయితే ఎక్కిళ్ల సమస్య సాధారణంగా గొంతులో ఆహారం చిక్కుకుపోవడం వల్ల వస్తుంది. యాసిడ్ రిఫ్లక్స్ మరియు బ్రెయిన్ ట్రామా వల్ల ఎక్కిళ్లు వస్తాయి. ఎక్కిళ్లు ఒక చిన్న సమస్య కావచ్చు కానీ.. దానిని తొలగించడం ఒక్కోసారి చాలా కష్టం అవుతుంది. కొన్ని ఇంటి చిట్కాలతో ఎక్కిళ్లను సులభంగా తొలగించుకోవచ్చు. అవేంటో ఓసారి చూద్దాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నీరు తాగడం:
ఎక్కిళ్లు వచ్చినప్పుడు నీరు త్రాగడం ద్వారా తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. అయితే నీటిని త్రాగే విధానాన్ని తెలుసుకోవడం మాత్రం చాలా ముఖ్యం. ఎక్కిళ్లు వచ్చినప్పుడు నిదానంగా నీళ్లు తాగాలి. చల్లని నీరు తాగడం మేలు చేస్తుంది.


దృష్టిని మళ్లించాలి:
ఎక్కిళ్లు పట్టిన వ్యక్తి దృష్టిని మళ్లించాలి. డిస్ట్రక్షన్ ఎక్కిళ్లను తగ్గించడంలో సహాయపడుతుంది. ఎవరికైనా ఎక్కిళ్లు ఎక్కువగా ఉన్నట్లయితే.. మీరు కాస్త భయపెట్టినా సరిపోతుంది. 


నిమ్మరసం:
మద్యం సేవించిన తర్వాత కొందరికి ఎక్కిళ్లు మొదలవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో నిమ్మరసం తింటే తక్షణ ఉపశమనం పొందవచ్చు. నిమ్మకాయను నమలడం కూడా ప్రయోజనకరం.


శ్వాసను ఆపడం:
ఎక్కిళ్లు వచ్చినప్పుడు శ్వాసను ఆపడం వల్ల ఉపశమనం లభిస్తుంది. డయాఫ్రాగమ్‌లో ఉద్రిక్తత వల్ల ఎక్కిళ్ళు వస్తాయి. కాబట్టి శ్వాసను కాస్త ఆపడం ద్వారా డయాఫ్రాగమ్ సడలుతుంది.


ఐస్‌ బ్యాగ్‌:
ఎక్కిళ్లు వచ్చినప్పుడు ఐస్‌ బ్యాగ్‌ని కౌగిలించుకోవడం వల్ల ఉపశమనం కలుగుతుంది. ఎక్కిళ్లు ఎక్కువగా ఉంటే.. ఐస్ బ్యాగ్ మెడకు చుట్టుకున్నా మంచి ఫలితం ఉంటుంది. 


Also Read: శ్రీలంక సిరీస్‌కు ముందు బీసీసీఐ కీలక నిర్ణయం.. టీ20 జట్టుకు కొత్త కెప్టెన్‌! రోహిత్ ఉన్నా అతడే   


Also Read: ఫుల్ ఛార్జితో 300 కిలోమీటర్ల ప్రయాణం.. ఈ ఎలక్ట్రిక్ బైక్‌ను కళ్లు మూసుకొని కొనేయొచ్చు!  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.