High Blood Pressure Control: అధిక రక్తపోటును ప్రభావంతంగా తగ్గించే 4 టీలు ఇవే..వీరు కూడా తగొచ్చు!
High Blood Pressure Control: అధిక రక్తపోటుతో బాధపడేవారు ప్రతి రోజు ఈ కింది టీలను తాగడం వల్ల గొప్ప ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా తీవ్ర దీర్ఘకాలిక వ్యాధుల కూడా దూరమవుతాయి. కాబట్టి ప్రతి రోజు తాగండి.
High Blood Pressure Control: అనారోగ్యకరమైన ఆహారాలు, మారుతున్న జీవనశైలి కారణంగా చాలా మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. దీనినే చాలా మంది బీపీ అని కూడా అంటారు. ఈ సమస్య బారిన పడితే అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీని కారణంగా చాలా మందిలో గుండె జబ్బులు, కిడ్నీ ఫెయిల్యూర్ వంటి సమస్యలు వస్తున్నాయి. అంతేకాకుండా చాలా మందిలో కళ్లపై కూడా ప్రభావం పడుతోంది. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా జీవనశైలిలో ప్రత్యేక మార్పులు చేసుకోవాలి. లేకపోతే తీవ్ర వ్యాధులు తప్పవని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ప్రతి రోజు పాల టీలకు బదులుగా ఈ కింది టీలను తాగాల్సి ఉంటుంది.
అల్లం టీ:
అధిక రక్తపోటుతో బాధపడుతున్నవారికి అల్లం టీ ప్రభావంతంగా సహాయపడుతుంది. ఇందులో ఉండే గుణాలు అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాకుండా బీపీని అదుపులో ఉంచేందుకు కూడా ప్రభావంతంగా సహాయపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. అయితే అల్లం టీలో తేనెను మిక్స్ చేసుకుని తాగితే రెట్టింపు లాభాలు కలుగుతాయి.
గ్రీన్ టీ:
ప్రతి రోజు గ్రీన్ టీ తాగడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు భావిస్తున్నారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అధిక రక్తపోటు సమస్య ఉన్నవారికి ప్రభావంతంగా సహాయపుడుతుంది. అంతేకాకుండా శరీరంలోని విష పదార్థాలను తొలగించేందుకు కూడా దోహదపడుతుంది.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
మందార టీ:
మందార టీలో ఆంథోసైనిన్స్, ఫ్లేవనాయిడ్స్ అనే సమ్మేళనాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు తీసుకోవడం వల్ల బీపీ నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా మైండ్ కూడా రిలీఫ్ అవుతుంది.
దానిమ్మ రసం:
అధిక బీపీ నియంత్రించేందుకు దానిమ్మ రసం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్ రక్తాన్నిఫిల్టర్ చేసేందుకు సహాయపడతాయి. అంతేకాకుండా రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి