High BP Signs: ఇండియాలో హై బ్లడ్ ప్రెషర్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రక్తపోటును నియంత్రించకుంటే గుండె పోటు, స్ట్రోక్‌కు దారి తీయవచ్చు. బ్లడ్ ప్రెషర్ ఉంటే చాలా లక్షణాలు కన్పిస్తుంటాయి. కొన్ని లక్షణాలు చాలా అరుదుగా ఉంటాయి. వీటిని మాత్రం తేలిగ్గా తీసుకోకూడదు. ఇవి చాలా ప్రమాదకరం. ఈ ప్రమాదకర లక్షణాలు ఏంటనేది తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సాధారణంగా హై బీపీ ఉన్నప్పుడు అకారణంగా అంటే ఏ పనీ చేయకుండానే అలసట వస్తుంది. లేదా నీరసం ఎక్కువగా ఉంటుంది. మీక్కూడా ఇలా ఉంటే వెంటనే బీపీ చెక్ చేసుకోండి. బ్యాలెన్స్ డైట్, వ్యాయామం. 7-8 గంటల నిద్ర తప్పకుండా ఉండాలి. సకాలంలో వైద్యుని సంప్రదించాలి. మరీ ముఖ్యంగా కంటి చూపు మసకగా ఉండవచ్చు. అందుకే ఎప్పటికప్పుడు కంటి పరీక్ష అవసరం. ఇది హైపర్ టెన్షన్ లక్షణం కావచ్చు. బ్లర్ విజన్ నియంత్రించేందుకు మందులు వాడాలి. డైట్, జీవనశైలి మర్చాలి. 


బ్లడ్ ప్రెషర్ ఎక్కువైనప్పుడు రెండు చెవుల్లో రీ సౌండ్ ఉండటం గమనించవచ్చు. సాధారణంగా ఇలా ఉన్నప్పుడు చెవి సంబంధిత సమస్య అనుకుంటాం. కానీ దీనికి నేరుగా రక్తపోటుతో సంబంధముంటుంది. ఇలాంటప్పుడు ఒత్తిడి తగ్గించుకోవాలి. వైద్యుని సంప్రదించాలి. 


తరచూ తలనొప్పి రావడం కూడా ప్రధాన లక్షణం. చాలా సార్లు హద్దు దాటి ఉంటుంది. అంటే భరించలేనంత నొప్పి ఉంటుంది. ఇది కచ్చితంగా అధిక రక్తపోటు లక్షణం. మీకు ఇలాంటి పరిస్థితి ఎదురైతే వెంటనే వైద్యుని సంప్రదించాలి. బీపీ టెస్ట్ చేయించుకోవాలి. ఇక్కడ ప్రస్తావించిన ఈ నాలుగు లక్షణాలు చాలా అరుదుగా ఉంటాయి. ఈ లక్షణాలు మీ లో కన్పిస్తే వెంటనే అప్రమత్తం కావాలి. లేకపోతే ప్రాణాంతక పరిస్థితికి దారితీయవచ్చు.


Also read: Fatty Acids importance: దేనిపైనా ఏకాగ్రత ఉండటం లేదా, మీ సమస్య ఇదే వెంటనే ఈ డైట్ తీసుకోండి



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook