High Blood Pressure Treatment: చిటికలో అధిక రక్తపోటును తగ్గించే అద్భుత చిట్కా ఇదే, మీరు ట్రై చేయండి!
Natural Ways To Lower High Blood Pressure Immediately: గోదుమ గడ్డి రసం ప్రతి రోజూ తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల ప్రయోజనాలను కలిగిస్తుంది. అయితే ఎలాంటి ఆహారాలు ప్రతి రోజూ తీసుకోవడం రక్తపోటు తగ్గుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
Natural Ways To Lower High Blood Pressure Immediately: ఆధునిక జీవనశైలి కారణంగా చాలా మంది తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఇందులో చాలా మంది అధిక రక్తపోటుతో పాటు మధుమేహం వంటి దీర్ఘకాలి వ్యాధుల బారిన పడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి ఉసశమనం పొందడానికి మార్కెట్‌లో లభించే చాలా రకాల ప్రోడక్ట్స్ వినియోగిస్తున్నారు. అయినప్పటికీ ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందలేకపోతున్నారు. అయితే దీని కారణంగా చాలా మందిలో గుండెపోటు, స్ట్రోక్ వంటి తీవ్ర అనారోగ్య సమస్యలకు గురికావడంతో ప్రాణాంతకంగానూ మారుతుంది. ఈ తీవ్ర సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ఆరోగ్య నిపుణులు సూచించిన పలు రకాల చిట్కాలను పాటించడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. అయితే ఎలాంటి చిట్కాలను పాటించడం వల్ల సులభంగా రక్త పోటు సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
అధిక రక్తపోటుకు కారణాలు:
పోషకాహార నిపుణుడు అంజలి ముఖర్జీ తెలిపిన వివరాల ప్రకారం.. అధిక రక్తపోటుకు అధిక బరువు, అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు కారణంగా, ధూమపానం అలవాటు, అధిక ఒత్తిడికి గురికావడం, అధికంగా మద్యం సేవించడం మొదలైన అనేక కారణాలు వస్తుంది. అంతేకాకుండా కొంత మందిలో ఎక్కువ పిండి పదార్థాలు తీసుకోవడం వల్ల కూడా వస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆధునిక జీవనశైలిని అనుసరించడం కూడా మానుకోవాల్సి ఉంటుంది.
అధిక రక్తపోటు స్థాయిని తగ్గించడానికి సహజ మార్గాలు:
బరువు తగ్గించడం వల్ల కూడా సులభంగా అధిక రక్తపోటు సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలను ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది.
శరీర బరువు పెరగడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. అంతేకాకుండా శరీంలో కొలెస్ట్రాల్ పెరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి తప్పకుండా శరీర బరువును అదుపులో ఉంచుకోవాల్సి ఉంటుంది.
ప్రతి రోజూ మద్యం, సిగరెట్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా అధిక రక్తపోటు సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ఈ చెడు అలవాట్లను మానుకోవడం వల్ల కూడా సులభంగా ఈ రక్త పోటు సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చు.
అధిక రక్తపోటుతో పాటు, ఊబకాయం సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ప్రతి రోజూ వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ యోగా చేయడం వల్ల సులభంగా ఈ రెండు సమస్యల నుంచి పూర్తిగా ఉపశమనం పొందచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
వారానికి రెండు మూడు సార్లు చేపలు తినడం కూడా ఆరోగ్యకరమని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఇందులో ఉండే అనేక మూలకాలు అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా రక్తపోటును తగ్గించడానికి ప్రభావవంతంగా సహాయపడుతుంది.
గోధుమ గడ్డి రసం తాగడం వల్ల కూడా అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో ఉండే గుణాలు రక్త పోటును నియంత్రించి, బరువును కూడా తగ్గిస్తుంది.
Also Read: Manchu Family Fighting : మంచు బ్రదర్స్ వివాదం.. రంగంలోకి మోహన్ బాబు?.. వెనక్కి తగ్గిన మనోజ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook