High Cholesterol: డ్రై ఫ్రూట్ ఆరోగ్యానికి శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను అందిస్తాయి. ఇవి ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. ముఖ్యంగా జీడి పప్పు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. వీటిని తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతుందని చాలా మంది అనుకుంటున్నారు. అవును నిజమే వీటిని తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుందని ఇటీవలే చాలా ప్రచారం జరుగుతుంది. అయితే జీడి పప్పు వల్ల శరీరంలో కొవ్వు నిజంగానే పెరుగుతుందా.. ఈ కథనం ఏం చెబుతుందో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జీడిపప్పు తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందా?:


ఎండాకాలంలో డ్రై ఫ్రూట్‌ని తక్కువగా తింటున్నా.. దాని ప్రభావం శరీరపై చూపుతుందని వీటిని తినడం చాలా మంది మానేశారు. అంతేకాకుండా  కొలెస్ట్రాల్ పెరుగుతుందనే భయం చాలా మందిలో నెలకొంది. కానీ కొందరు నిపుణులు.. ఇది కేవలం అపోహలు తెలుసపుతున్నారు.


జీడిపప్పులో లభించే పోషకాలు:


జీడిపప్పులో ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్, కాపర్, మాంగనీస్, ఫాస్పరస్, మెగ్నీషియం, జింక్, థయామిన్, విటమిన్ బి6, విటమిన్ కె, ఐరన్, పొటాషియం వంటి పోషకాలు ఉంటాయి. కానీ ఇందులో కొలెస్ట్రాల్ ఉండదు కాబట్టి భారతీయులు జీడిపప్పును పోషకాల నిధి అని పిలుస్తారు.


జీడిపప్పు గుండెకు మేలు చేస్తుంది:


జీడిపప్పు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. అంతేకాకుండా కాళ్ల నొప్పులు కూడా దూరమవుతాయి. ఇందులో కొలెస్ట్రాల్ లేకపోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంచుతుంది.


జీడిపప్పు తినడం వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు:



1. జీడిపప్పు చర్మానికి చాలా మేలు చేస్తుంది.


2. ఈ డ్రై ఫ్రూట్  క్రమం తప్పకుండా తినడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది.


3. రక్తంలో చక్కెర స్థాలను అదువులో ఉంచుతుంది.


4. ఇది శరీర బరువును నియంత్రించేందుకు దోహదపడుతుంది.


5. ఎముకలు కూడా దృఢంగా మారతాయి.


6. జీడిపప్పులో కాపర్, ఐరన్ స్థాయిలు అధికంగా ఉంటాయి. ఇవి ఎర్ర రక్తకణాల ఏర్పాటుకు సహాయపడతాయి.


(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Also Read: Lemon And Curd For Hair: జుట్టు సమస్యల నుంచి ఇలా సులభంగా విముక్తి పొందండి..!


Also Read: Parrot Viral Video: ఈ చిలక ఆమెతో ఏం మాట్లాడిందో తెలుసా.. నెట్టింట తెగ వైరల్‌ అవుతున్న వీడియో..!



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook