Parrot Viral Video: ఈ చిలక ఆమెతో ఏం మాట్లాడిందో తెలుసా.. నెట్టింట తెగ వైరల్‌ అవుతున్న వీడియో..!

Parrot Viral Video: ప్రస్తుతం పక్షులు, జంతువులకు సంబంధించిన చాలా వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతాయి. ఇలా వైరల్‌ అయిన వీడియోలు నవ్వు పుట్టిస్తే.. మరి కొన్ని హృదయాలకు హత్తుకుపోతున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 16, 2022, 10:59 AM IST
  • వేడి టీని అడిగిన చిలక
  • నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో
  • హిందీలో తెగ మాట్లాడిన చిలక
 Parrot Viral Video: ఈ చిలక ఆమెతో ఏం మాట్లాడిందో తెలుసా.. నెట్టింట తెగ వైరల్‌ అవుతున్న వీడియో..!

Parrot Viral Video: ప్రస్తుతం పక్షులు, జంతువులకు సంబంధించిన చాలా వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతాయి. ఇలా వైరల్‌ అయిన వీడియోలు నవ్వు పుట్టిస్తే.. మరి కొన్ని హృదయాలకు హత్తుకుపోతున్నాయి. మరి కొన్ని వీడియోలైతే.. కొందరిని గుబులు పుట్టిస్తున్నాయి. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియో అందరినీ ఆశ్చర్యనికి గురి చేస్తుంది. మీరు ఈ వీడియోలో చూసినట్లైతే.. ఓ ఎరుపు రంగు చిలుక హిందీలో తన చిన్న గొంతుతో తెగ మాట్లాడుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆహా అంటున్నారు. వంట గదిలో ఉన్న మహిళతో చిలక హిందీలో  టీని డిమాండ్ చేస్తోంది. ఈ నవ్వుపుట్టించే మాటలను చూసి నెటిజన్లు ఫన్నీ రియాక్షన్‌లతో కామెంట్లు చేస్తున్నారు.

హిందీలో తెగ మాట్లాడుతున్న చిలుక:

చిలుక మానవులు మాట్లాడే అన్ని భాషలను మాట్లాడగలుగుతుంది. మనం ఇంత ముందు చూసిన చాలా  వీడియోల్లో చిలక వివిధ భాషల్లో మాట్లడం చూశాం.
కానీ ఈ వీడియోలో వైరల్‌ అవుతున్న చిలక అన్ని చిలకల్లా కాదు. మహిళ మాట్లాడిన అన్ని మాటాలకు సమాధానం ఇస్తూ చాలా చక్కగా మాట్లాడుతోంది. అయితే ఆమె అన్న మాటలను మళ్లీ తిరిగి అంటూ.. వాటికి ఖచ్చితమైన సమాధానం ఇస్తుంది.

చిలక మహిళను టీ అడుగుతోంది:

ఈ వీడియోలో.. చిలుక చిన్న మంచం మీద కూర్చుని 'మమ్మీ' అని తన స్వరంతో అరుస్తూ ఉంటుంది. ఈ అందమైన చిలుక ఇతర భారతీయ పిల్లల్లాగే మమ్మీ అని పిలవడానికి ప్రయత్నిస్తోంది. ఆ మహిళ వెనుక నుంచి పక్షికి సమాధానం ఇచ్చింది. ఈ వీడియోలో చిలుక ఆమెతో రెండు నిమిషాలకు పైగా హిందీలో మాట్లాడింది.

ఈ వీడియోను ఐపీఎస్ అధికారి దీపాంశు కబ్రా ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ వీడియోను నెటిజన్లతో పంచుకుంటూ.. 'మనం ఎవరైనా సన్నిహితంగా మాట్లాడుతుంటే.. సన్నిహితంగా కమ్యూనికేట్ చేయడం చాలా మంచి అలవాటని '  క్యాప్షన్‌లోవ్రాశారు. ప్రస్తుతం ఈ వీడియోను 56 వేలకు పైగా నెటిజన్లు వీక్షించారు.

Also Read: Weight Loss Tips: కీరదోసకాయ వల్ల శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..!

Also Read: Fenugreek Leaves Benefits: డయాబెటిస్ రోగులు తప్పనిసరిగా ఈ ఆకును తింటే.. రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది.!

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

 

Trending News