Cholesterol Tips: ఈ 5 డ్రింక్స్ తీసుకుంటే..రక్త నాళికల్లో ఉండే కొవ్వు కూడా 30 రోజుల్లో మాయం
Cholesterol Tips: హై కొలెస్ట్రాల్ అనేది చాలా ప్రమాదకరం. ఫలితంగా గుండె వ్యాధుల ముప్పు ఎక్కువగా ఉంటుంది. కొలెస్ట్రాల్ తగ్గించుకునేందుకు కొన్ని సులభమైన చిట్కాలు పాటిస్తే చాలంటున్నారు ఆరోగ్య నిపుణులు.
మీ రక్త నాళికల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోయినా..కేవలం నెల రోజుల్లో క్లీన్ చేయవచ్చు. దీనికోసం 5 రకాల జ్యూస్‌లు క్రమం తప్పకుండా తాగాల్సి వస్తుంది. ఆ జ్యూస్‌లు ఏంటనేది తెలుసుకుందాం.
కొలెస్ట్రాల్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి చెడు కొలెస్ట్రాల్ రెండవది మంచి కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్ అనేది పరిమితంగా ఉండాలి. కొలెస్ట్రాల్ పరిమాణం ఎక్కువైతే సీరియస్ వ్యాధులు చుట్టుముడుతుంటాయి. కొలెస్ట్రాల్ పెరగడానికి ప్రధాన కారణం అనారోగ్యకరపు ఆహార అలవాట్లు జీవనశైలి సరిగ్గా లేకపోవడం. కొలెస్ట్రాల్ అనేది రక్తలో మైనంలా ఉండే ఓ పదార్ధం. సహజంగా అనారోగ్యకరమైన ఆహార పదార్ధాల వల్ల వస్తుంది. రక్త నాళికల్లో సైతం పేరుకుపోతుంటుంది. కొలెస్ట్రాల్ కారణంగా దమనుల ద్వారా జరిగే రక్త ప్రసరణలో ఆటంకం ఏర్పడుతుంది. ఫలితంగా గుండెపోటు, స్ట్రోక్ ముప్పు పెరుగుతుంది. ఈ క్రమంలో ఐదు రకాల జ్యూస్‌లు సేవిస్తే నెలరోజుల్లోనే కొలెస్ట్రాల్ నుంచి విముక్తి పొందవచ్చు.
టొమాటో జ్యూస్
టొమాటోలో లైపీన్ అనే న్యూట్రియంట్ ఉంటుంది. ఇది శరీరంలో లిపిడ్ లెవెల్స్‌ను మెరుగుపరుస్తుంది. టొమాటో జ్యూస్‌లో కొలెస్ట్రాల్ తగ్గించే ఫైబర్, నియాసిన్ ఉంటాయి. అందుకే రోజూ క్రమం తప్పకుండా టొమాటో జ్యూస్ తీసుకోవాలి.
బెర్రీ స్మూదీ
బెర్రీ స్మూదీలో యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. వీటివల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి. ఈ డ్రింక్ చాలా ఆరోగ్యకరమైంది.
ఓట్స్ డ్రింక్
ఓట్స్ అనేది ఒక ఆరోగ్యకరమైన డైట్. ఇందులో బీటా గ్లూకోజ్ ఉంటుంది. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. అందుకే ప్రతిరోజూ ఓట్స్ డ్రింక్ తీసుకోవడం వల్ల మంచి ఫలితాలుంటాయి.
గ్రీన్ టీ
గ్రీన్ టీలో క్యాటెచిన్స్ , యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి అనారోగ్యకరమైన కొలెస్ట్రాల్ తగ్గించేందుకు దోహదపడతాయి.
సోయా మిల్క్
సోయా మిల్క్ ద్వారా అవాంచిత కొలెస్ట్రాల్ తగ్గించవచ్చు. దీనివల్ల హార్ట్ ఎటాక్ ముప్పు కూడా తగ్గుతుంది. ప్రతిరోజూ కనీసం 25 గ్రాముల సోయా పాలు తాగాలి.
Also read: Radish Benefits: చలి కాలంలో వచ్చే దీర్ఘకాలిక వ్యాధులకు సులభంగా ఇలా చెక్ పెట్టొచ్చు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook