Radish Benefits: భారత్‌లో ప్రస్తుతం చలి కాలం మొదలైంది. అయితే ఈ క్రమంలో పండ్లు, కూరగాలు మార్కెట్‌లో విచ్చలవిడిగా లభిస్తాయి. ముఖ్యంగా మార్కెట్‌లో లభించే కూరగాయల్లో ఆరోగ్యానికి మేలు చేసే ముల్లంగి ఒకటి. దీనిని ఎక్కువగా సలాడ్స్‌లో వినియోగిస్తారు. ఇందులో శరీరానికి కావాల్సిన విటమిన్ ఎ, బి, సి, ప్రోటీన్, కాల్షియం మరియు ఐరన్ కూడా పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా చాలి కాలంలో వచ్చే సీజనల్ వ్యాధులన్నీ తగ్గుతాయి.
శీతాకాలంలో ముల్లంగి శరీరానికి చాలా అవసరం:
ముల్లంగిలో క్యాల్షియం, సోడియం, ఐరన్, ప్రొటీన్, ఫైబర్, విటమిన్ సి వంటి అనేక పోషకాలు ఉంటాయి. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకుంటే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా బాడీకి పోషకాలు లభిస్తాయి. రెగ్యులర్ ముల్లంగిని తీసుకుంటే.. శరీరాన్ని అన్ని వ్యాధుల నుంచి రక్షిస్తుంది.
ఈ వ్యాధులకు చెక్:
>>పొట్ట సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి సహాయపడుతుంది.
>>రక్తంలోని చక్కెర పరిమాణాలను నియంత్రిస్తుంది.
>>ముఖ్యంగా మధుమేహాన్ని నియంత్రిస్తుంది.
>>సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
>>శరీరానికి పోషకాలు అందుతాయి.
ముల్లంగిలో విటమిన్ సి కూడా సమృద్ధిగా లభిస్తుంది. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకుంటే శరీరాన్ని అనారోగ్య సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. ముఖ్యంగా కణాలు దెబ్బతినకుండా కాపాడుతుంది. ముఖ్యంగా వీటిని చలి కాలంలో సలాడ్స్‌లో తీసుకుంటే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Nanda Kumar Bail: నంద కుమార్‌కి బెయిల్.. అంతలోనే పిటి వారంట్ కావాలన్న పోలీసులు
Also Read: Nanda Kumar Bail: నంద కుమార్‌కి బెయిల్.. అంతలోనే పిటి వారంట్ కావాలన్న పోలీసులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook