High Cholesterol Risk Factors: సిరల్లో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్.. మీ శత్రువు కంటే ప్రమాద కరమైంది. ఈ చెడు కొలెస్ట్రాల్ ఎంతో ప్రమాదకరమైన అనేక వ్యాధులకు కారణం అవుతుంది. తక్కువ సాంద్రత కలిగిన చెడు కొలెస్ట్రాల్‌ను లిపోప్రొటీన్ (ఎల్‌డీఎల్) అని కూడా అంటారు. ఈ జిగట పదార్ధం మన ధమనులలో పెద్ద పరిమాణంలో పేరుకుపోతే.. అది రక్త ప్రవాహాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ ఎల్‌డీఎల్ వల్ల మనిషికి పెను ప్రమాదం అని చెప్పాలి. దీని వల్ల ఎలాంటి వ్యాధులు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Artery Disease:
మన సిరల్లో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోవడం ప్రారంభించినప్పుడు ధమనులు సరిగా పనిచేయవు. ఈ ప్రక్రియను అథెరోస్క్లెరోసిస్ అంటారు. దీని కారణంగా రక్తం మరియు ఆక్సిజన్ గుండెకు చేరవు. దాంతో మనిషి తీవ్రమైన పరిణామాలకు గుర్వక తప్పదు. 


Heart Attack:
రక్తంలో చెడు కొలెస్ట్రాల్ చేరడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుంది. కొన్నిసార్లు దీని వల్ల ప్రాణం కూడా పోతుంది. సిరల్లో అడ్డంకులు ఏర్పడినప్పుడు.. రక్తం గుండెకు చేరుకోవడానికి చాలా శక్తి కావాల్సి ఉంటుంది. దాని కారణంగా గుండెపోటు వస్తుంది.


Stroke:
చెడు కొలెస్ట్రాల్ వల్ల స్ట్రోక్ కూడా వస్తుంది. వాస్తవానికి ఎల్‌డీఎల్ గుండె యొక్క సిరలను నిరోధించడమే కాకుండా.. మెదడుకు వెళ్లే ధమనులలో అడ్డంకిని కలిగిస్తుంది. దాంతో స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది. దీనిని 'బ్రెయిన్ స్ట్రోక్' అని కూడా అంటారు. ఇటీవల ఈ వ్యాధి కారణంగా చాలా మంది మరణిస్తున్నారు.


Erectile Dysfunction:
చెడు కొలెస్ట్రాల్ పురుషుల సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తుంది. అనేక పరిశోధనలు ప్రకారం.. అంగస్తంభన మరియు చెడు కొలెస్ట్రాల్ మధ్య సంబందం ఉంటుందట. చెడు కొలెస్ట్రాల్ కారణంగా పురుషులు తండ్రులు కావడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు.


Also Read: ప్రభుత్వ ఉద్యోగులకు న్యూ ఇయర్ గిఫ్ట్.. 4 శాతం డీఏ పెంపు! జనవరి నుంచే పెరిగిన జీతం


Also Read: Purse Vastu Tips: కొత్త ఏడాదిలో ఈ వస్తువులు పర్స్‌లో పెట్టుకుంటే.. ఏడాది పొడవునా డబ్బేడబ్బు!  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.