Purse Money Tips, Keep These Things in Your Wallet for Huge Money: కొత్త సంవత్సరం 2023 మొదలైంది. ప్రతి వ్యక్తి కొత్త సంవత్సరం ప్రారంభం మంచిగా ఉండాలని కోరుకుంటాడు. అందుకు ఏడాది పొడవునా ఎలాంటి సమస్యలను ఎదుర్కోకూడదని ఆ దేవుడిని ప్రార్ధిస్తాడు. ఈ నేపథ్యంలో సంవత్సరం ప్రారంభంలో కొన్ని పనులు చేయడం ద్వారా ఒక వ్యక్తి తన అదృష్టాన్ని మార్చుకోవచ్చు. వాస్తుశాస్త్రంలో పర్సుకు సంబంధించిన కొన్ని పరిహారాలు చెప్పబడ్డాయి. ఈ పరిహారాలు సంవత్సరం ప్రారంభంలోనే చేస్తే.. ఆ వ్యక్తి ఏడాది పొడవునా లక్ష్మీ దేవి అనుగ్రహాన్ని పొందుతాడు. అవేంటో ఓసారి చూద్దాం.
కొంతమంది బాగా కష్టపడి పని చేసినా విజయం దక్కదు. ఎంత శ్రమించినా డబ్బు సంబంధిత సమస్యలను ఎదుర్కొంటూనే ఉంటారు మరికొంత మంది. అటువంటి వారికోసం వాస్తుశాస్త్రంలో కొన్ని పరిహారాలు ఉన్నాయి. సంవత్సరం ప్రారంభంలో ఈ వస్తువులను పర్సులో ఉంచుకోవడం చాలా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ విషయాల గురించి ఈరోజు తెలుసుకుందాం.
రావి ఆకు:
ఏదైనా శుభ సమయంలో మీ పర్సులో రావి ఆకు పెట్టుకోండి. ఈ పరిహారం చేయడం ద్వారా మీ జీవితంలో ఎలాంటి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. రావి చెట్టులో సకల దేవతలు కొలువై ఉంటారని చెబుతారు. అలాగే రావి ఆకులో లక్ష్మిదేవి నివసిస్తుందంటారు.
గవ్వ:
సంవత్సరం ప్రారంభంలో ఖచ్చితంగా మీ పర్సులో లక్ష్మిదేవికి ప్రియమైన గవ్వలను ఉంచండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ పట్ల ఎల్లప్పుడూ దయ చూపుతుంది. దీనివల్ల విశేష ప్రయోజనం ఉంటుంది.
బియ్యం గింజలు:
వాస్తు శాస్త్రం ప్రకారం సంవత్సరం ప్రారంభంలోనే మీ పర్సులో కొన్ని బియ్యం గింజలు ఉంచండి. దీని వల్ల ఏడాది పొడవునా మీ పర్సులో డబ్బు పెరుగుతుంది. ఇలా చేస్తే.. లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది. దాంతో డబ్బు వర్షం కురుస్తుంది.
తామర గింజలు:
సంవత్సరం ప్రారంభంలో మొదటి కొన్ని రోజుల్లో మీ పర్సులో తామర గింజలను ఉంచండి. ఈ పరిహారం చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. లక్ష్మీదేవికి తామర పువ్వు ఎంతో ప్రీతికరమైనది. ఎరుపు రంగు వస్త్రంలో తామర గింజలను ఉంచి వాటిని పర్సులో ఉంచుకోవడం శుభపరిణామం. దాంతో నిత్యం డబ్బు పర్సులో ఉంటుంది.
Also Read: Shani shukra Yuti 2023: శని శుక్ర యుతి 2023.. ఈ 3 రాశుల వారికి మంచి రోజులు మొదలు! ఇల్లు నిండా డబ్బే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.