High Cholesterol Warning Signs In Winter: శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడం వల్ల చాలా మందిలో టెన్షన్ గురవుతున్నారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఎందుకంటే ఇది చాలా మందిలో గుండెపోటు, అధిక రక్తపోటు, మధుమేహం, ఊబకాయం, కరోనరీ ఆర్టరీ వ్యాధి, ట్రిపుల్ నాళాలల వ్యాధుల ప్రమాదాన్ని పెంచే అవకాశాలున్నాయి. అంతేకాకుండా కొందరిలో ఇది ప్రాణాంతకంగా కూడా మారే అవకాశాలున్నాయి. కాబట్టి కొలెస్ట్రాల్‌ పెరిగినప్పుడు తప్పకుండా దాని పరిమాణాన్ని పరిశీలించేందుకు  లిపిడ్ ప్రొఫైల్ పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. లేకపోతే పై తీవ్ర సమస్యల బారిన పడే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా శరీరంలో కొలెస్ట్రాల్‌ పెరిగినప్పుడు పలు రకాల లక్షణాలు శరీరంపై కనిపిస్తాయి. అయితే ఆ లక్షణాలేంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శరీరంలో కొలెస్ట్రాల్‌ పెరిగితే ఈ సమస్యలు తప్పవు:
ఊబకాయం:

పొట్ట, నడుము చుట్టూ కొలెస్ట్రాల్ స్థాయిలు విపరీతంగా పెరిగితే తప్పకుండా మీరు లిపిడ్ ప్రొఫైల్ పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. ఒక వేళా శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ పెరిగితే వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది.


తరచుగా ఛాతి నొప్పి:
మన రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరిగినప్పుడల్లా ఛాతీపై ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో ఛాతి భాగంగాలో నొప్పులు సంభవించే అవకాశాలున్నాయి. అంతేకాకుండా దీంతో పాటు ఇతర అవయవాల్లో కూడా సమస్యలు వచ్చే ఛాన్స్‌ ఉందని ఆరోగ్య నిపుణులు తెలుపున్నారు. అంతేకాకుండా కొన్న సందర్భాల్లో ఇది గుండెపోటుకు కూడా కారణం అవ్వొచ్చని ఆరోగ్య నిపుణులు భావిస్తున్నారు.


కాలి నొప్పి:
కొలెస్ట్రాల్ పెరగడం వల్ల సిరల్లో ఫలకం పేరుకుపోయి.. సిరల్లో తీవ్ర మార్పులు వస్తాయి. దీని ప్రభావం పాదాలపై పడి రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడుతాయి. అంతేకాకుండా  పాదాలకు రక్తం, ఆక్సిజన్ చేరుకోవడంలో పాదాల్లో విపరీతమైన నొప్పులు సంభవించే అవకాశాలున్నాయి. కాబట్టి ఇలాంటి నొప్పులతో బాధపడే వారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.


విపరీతమైన చెమట:
వేడి శరీరం వారికి శారీరక శ్రమం చేయడం వల్ల సులభంగా చెమటలు పట్టే అవకాశాలున్నాయి. కానీ బరువు పెరగడం వల్ల కొంచెం నడిచిన చెమటలు వస్తాయి. ఇలా తరచుగా చమటలు పడితే తప్పకుండా వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది. లేకపోతే గుండె పోటు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి ఇలా చెమటలు పడితే జాగ్రత్తలు పాటించడం మంచిది.


చర్మం రంగులో మార్పులు:
చెడు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు శరీరంలోని అనేక భాగాలలో రక్త ప్రవాహంపై ప్రభావితమై తీవ్ర మార్పులు సంభవించే అవకాశాలున్నాయి. దీని కారణంగా చర్మం పసుపు రంగులోకి మారుతుంది. ఇలా మారినప్పుడు తప్పకుండా వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


 


Also Read : Bihar Road accident: భక్తులపైకి దూసుకొచ్చిన ట్రక్కు... 12 మంది దుర్మరణం..


Also Read : Telangana: అయ్యప్ప పూజకు వెళ్లి వస్తుండగా ట్రాక్టర్‌ను ఢీకొట్టిన లారీ... ఐదుగురు దుర్మరణం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook