Telangana: రాంగ్‌ రూట్‌లో వస్తున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టిన లారీ... ఐదుగురు దుర్మరణం..

Road Accident in Telangana: రాంగ్ రూట్ లో వస్తున్న ట్రాక్టర్ ను లారీ ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృత్యువాత పడ్డారు. మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 13, 2022, 06:06 AM IST
Telangana: రాంగ్‌ రూట్‌లో వస్తున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టిన లారీ... ఐదుగురు దుర్మరణం..

Road Accident in Telangana: తెలంగాణ సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ ను లారీ ఢీకొట్టిన ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన మునగాల (Munagala) మండల కేంద్రం శివారులోని పెట్రోల్ బంగ్ వద్ద శనివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో చోటుచేసుకుంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు సమాచారం. 

అసలేం జరిగిందంటే...
మునగాలకు చెందిన కొందరు సమీపంలోని సాగర్‌ ఎడమ కాలువ గట్టుపై ఉన్న అయ్యప్పస్వామి ఆలయంలో శనివారం రాత్రి మహాపడి పూజకు హాజరయ్యారు. వారిలో దాదాపు 38 మంది ట్రాక్టర్‌లో ఇళ్లకు తిరుగుప్రయాణమయ్యారు. వీరు ప్రయాణిస్తున్న ట్రాక్టర్‌ విజయవాడ-హైదరాబాద్‌ హైవేపై రాంగ్‌ రూట్‌లో వెళ్తుండగా విజయవాడ నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. 

క్షతగాత్రులను  అంబులెన్స్, ఇతర వాహనాల్లో కోదాడ ఆసుపత్రికి  తరలించారు. తన్నీరు ప్రమీల(35), చింతకాయల ప్రమీల(33), ఉదయ్‌లోకేశ్‌(8), నారగాని కోటయ్య(55) మార్గం మధ్యలోనే ప్రాణాలు విడిచారు. గండు జ్యోతి(38) చికిత్స పొందుతూ మృతి చెందారు. కండిషన్ సీరియస్ గా ఉన్నవారిని ఖమ్మం, సూర్యాపేట ఆసుపత్రికి తరలించడానికి ఏర్పాట్లు చేశారు. 

కారు-ట్యాంకర్ ఢీ... ఇద్దరు మృతి
హనుమకొండ జిల్లాలో కూడా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు - ట్యాంకర్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు దుర్మరణం చెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Also Read: Telangana: నిరుద్యోగులకు శుభవార్త, స్కూల్ ఎడ్యుకేషన్ పోస్టుల భర్తీకు గ్రీన్ సిగ్నల్ 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu    

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News