High Protein Chickpeas For Weight Loss: ప్రస్తుతం చాలా మంది వివిధ కారణాల వల్ల సమతుల్య ఆహారాన్ని తీసుకోలేకపోతున్నారు. పోటీన్స్‌ కలిగి ఆహారాలు ప్రతి రోజు తీసుకోలేకపోవడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. ఆధునిక జీవనశైలి కారణంగా చాలా మందిలో ఊబకాయం సమస్యలు వస్తున్నాయి. దీని కారణంగా గుండెపోటుతో పాటు, తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఆకలి నియంత్రించే ప్రొటీన్‌లు అధికంగా ఆహారాలు తీసుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ప్రతి రోజు కాబూలి శెనగలు తీసుకోవడం వల్ల సులభంగా శరీర బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇందులో ఉండే గుణాలు తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కాబూలి శెనగలు బచ్చలికూర రెసిపీ:
ఈ కాబూలి శెనగలు బచ్చలికూర రెసిపీను అల్పాహారంలో తీసుకోవడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు శరీర బరువును సులభంగా నియంత్రిస్తాయి. అయితే ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో, దీనిని తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


ఈ రెసిపీని తయారు చేయడానికి కావల్సిన పదార్థాలు:
✺ 1 కప్పు శెనగ పిండి
✺ 1 కప్పు నీరు
✺ 1/4 స్పూన్ బేకింగ్ పౌడర్
✺ 1/4 స్పూన్ వెల్లుల్లి పొడి
✺ రుచికి సరిపడ ఉప్పు
✺ రుచికి సరిపడ నల్ల మిరియాలు
✺ 2  పచ్చి ఉల్లిపాయలు
✺ 1 కప్పు బచ్చలికూర
✺ 1 కప్పు పుట్టగొడుగు
✺ 1 టేబుల్ స్పూన్ సోయా సాస్
✺ 1/4 కప్పు కాబూలి శెనగలు
✺ 1/4 కప్పు జీడిపప్పు 


Also Read: Hamsa Nandini Photos: వైజాగ్ హార్బర్లో హంసానందిని సందడి.. పొట్టి గౌనులో అందాల ఆరబోత


రెసిపీ తయారి పద్ధతి:
✺ ముందుగా కాబూలి శెనగలు బాగా ఉడికించాల్సి ఉంటుంది. 
✺ ఇలా ఉడికించిన తర్వాత పక్కన పెట్టుకోవాలి.
✺ ఆ తర్వాత  ముందుగా ఒక గిన్నెలో శెనగపిండి, బేకింగ్ పౌడర్, వెల్లుల్లి పొడి, ఉప్పు, ఎండుమిర్చి, నీరు వేసి పిండిని సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది.
✺ వీటన్నింటి బాగా మిశ్రమంలా తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
✺ మీడియంగా వేడి బాణలిలో పాలకూర, పుట్టగొడుగులను వేయించాలి. అందులో సోయా సాస్ వేసి వేడి చేసి పక్కన పెట్టాలి.
✺ ఇప్పుడు నాన్‌స్టిక్‌ పాన్‌లో నూనె వేడి చేసి అందులో పై రెండు మిశ్రమాలను వేసుకుని బాగా మిక్స్‌ చేసుకోవాలి.
✺ ఇలా మిక్స్‌ చేసుకున్న తర్వాత సుమారు 3 నిమిషాలు ఉడికించి పక్కన పెట్టాలి.
✺ పక్కన పెట్టుకున్న తర్వాత జీడిపప్పు పన్నీర్ వేసి బాగా మిక్స్‌ చేసుకుకి ఆహారంలో తీసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి. 


Also Read: Hamsa Nandini Photos: వైజాగ్ హార్బర్లో హంసానందిని సందడి.. పొట్టి గౌనులో అందాల ఆరబోత



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook