RK Roja CID: మంత్రిగా ఆర్కే రోజా రూ.100 కోట్ల అవినీతి.. సీఐడీకి ఫిర్యాదుతో ఏపీలో కలకలం

CID Received Complaint Against RK Roja Byreddy Siddhartha Reddy: గత ప్రభుత్వంలో మంత్రిగా హల్‌చల్‌ చేసిన ఆర్‌కే రోజా చుట్టు ఉచ్చు బిగుస్తోందని సమాచారం. మంత్రిగా ఆమె అక్రమాలకు పాల్పడ్డారని సీఐడీకి కొందరు ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jun 14, 2024, 05:55 PM IST
RK Roja CID: మంత్రిగా ఆర్కే రోజా రూ.100 కోట్ల అవినీతి.. సీఐడీకి ఫిర్యాదుతో ఏపీలో కలకలం

RK Roja CID: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు, విధానాలపై కూటమి ప్రభుత్వం దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రధానంగా గత ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన ఆర్‌కే రోజా సెల్వమణిపైనే మొదటి చర్య ఉంటుందని సమాచారం. మంత్రిగా ఉన్న సమయంలో రోజా రెచ్చిపోయారు. మాటలతో చేష్టలతో టీడీపీ, జనసేన పార్టీలపై విరుచుకుపడ్డ విషయం తెలిసిందే. వాటిని కూటమి ప్రభుత్వం మరచిపోనట్టు కనిపిస్తోంది. త్వరలోనే రోజాకు బ్యాండ్‌ బాజా మోగించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే కొందరు మాజీ మంత్రి రోజాపై సీఐడీకి ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది.

Also Read: Chandrababu: అధికారులకు చంద్రబాబు ఝలక్‌.. పూల బొకేలు తిరస్కరణ

గతేడాది జగన్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 'ఆడుదాం ఆంధ్రా', 'సీఎం కప్‌' పేరిట క్రీడా పోటీలు నిర్వహించింది. సంబంధిత శాఖ మంత్రి ఆర్‌కే రోజా, క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్‌గా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆధ్వర్యంలో క్రీడా కార్యక్రమాలు జరిగాయి. అయితే ఆ పోటీల్లో భారీగా అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. నాసిరకం క్రీడా కిట్లు, ఏర్పాట్లు చేసి భారీగా నిధులు కొల్లగొట్టారని ఆ సమయంలోనే విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ఈ క్రీడా ఉత్సవాలపై ఫిర్యాదులు వచ్చాయి. ఈ విషయమై ఆత్యా పాత్యా సంఘం సీఈఓ ఆర్డీ ప్రసాద్‌ సీఐడీకి ఫిర్యాదు చేశారు. విజయవాడలో సీఐడీ అధికారులను కలిసి ఫిర్యాదు పత్రం అందించారు. 

Also Read: YS Jagan: శాసన మండలినే జగన్‌ అడ్డా.. చంద్రబాబుపై పోరాడుదామంటూ ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం

ఫిర్యాదు అనంతరం ఆర్డీ ప్రసాద్‌ మీడియాతో మాట్లాడారు. 'ఆడుదాం ఆంధ్రా' పేరుతో రూ.100 కోట్ల అవినీతి, అక్రమాలు జరిగాయని ఆరోపించారు. నాటి క్రీడల శాఖ మంత్రి, శాప్‌ చైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అనేక అకతవకలకు పాల్పడ్డారని చెప్పారు. ఈ అక్రమాలపై విచారణ చేయాలని సీఐడీకి ఫిర్యాదు చేశామని తెలిపారు. వైఎస్సార్‌సీపీ హయాంలో శాప్‌ ఎండీలు, ఆ శాఖ ఉన్నత అధికారులు, డీఎస్‌డీఓలపై విచారణ చేయాలని డిమాండ్‌ చేశారు. క్రీడా శాఖకు సంబంధించి అన్ని ఫైళ్లను పరిశీలించాలని కోరారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News