High Uric Acid Control: మన శరీరంలోని ఆహారం ఇతర అనారోగ్యకరమైన పానీయాలు ప్యూరిన్‌ విచ్చిన్నం అవడం కారణంగా అధిక మోతాదులో యూరిక్ యాసిడ్ ఏర్పడడం ప్రారంభమవుతుంది. దీని కారణంగా కొంతమందిలో కీళ్ల నొప్పులతో పాటు మోకాళ్ళ నొప్పులు శరీరంలోని ఇతర ప్రదేశాల్లో నొప్పులు వస్తూ ఉంటాయి. ఈ యాసిడ్ అధిక మొత్తంలో పేరుకుపోవడం కారణంగా ఇతర దీర్ఘకాలిక వ్యాధులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికే ఈ సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా ఆహారంలో మార్పులు చేర్పులు చేసుకోవడమే, కాకుండా ఆరోగ్య నిపుణులు సూచించిన ఆహారాలు పానీయాలు తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే శరీరంలో యూరికి యాసిడ్ తగ్గడానికి ఆరోగ్య నిపుణులు సూచిస్తున్న ఇంటి చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యాపిల్ సైడర్ వెనిగర్‌లో శరీరానికి కావాల్సిన అనేక రకాల పోషకాలు లభిస్తాయి. అంతేకాకుండా బాడీని ఆరోగ్యంగా ఉంచే వివిధ రకాల మూలకాలు కూడా ఉంటాయి. కాబట్టి యూరికి యాసిడ్ వంటి సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతి రోజు గోరువెచ్చని నీటిలో యాపిల్ సైడర్ వెనిగర్‌ని కలుపుకొని తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.


అంతేకాకుండా తరచుగా కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారు ప్రతిరోజూ ఉదయం అల్పాహారానికి ముందు బాదం, జీడిపప్పు, బచ్చలికూర వంటి మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల ఆర్థరైటిస్‌ నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు వాపులను తగ్గించేందుకు కూడా సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు అల్పాహారం తర్వాత యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడేవారు ఒక అరటిపండును తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.


శరీరంలో యూరిక్ యాసిడ్ తగ్గడానికి అల్లం టీ కూడా ప్రభావంతంగా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు శరీరంపై ఉన్న వాపులను తగ్గించడమే కాకుండా బాడీని హెల్తీగా ఉంచేందుకు ప్రభావంతంగా సహాయపడతాయి. అలాగే కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్న వారికి కొత్తిమీర కూడా ఎంతగానో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. కొత్తిమీరలో యాంటీ ఆక్సిడెంట్లు అధికమవుతాధిలో లభిస్తాయి. కాబట్టి ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నవారు ప్రతిరోజు కొత్తిమీరతో తయారుచేసిన ఆహారాలు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..
 
కొత్తిమీరలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు కూడా అధికంగా లభిస్తాయి. కాబట్టి కీళ్ల నొప్పులతో బాధపడేవారు తప్పకుండా ఆహారంలో దీనిని వినియోగించాలి. అంతేకాకుండా ముల్లంగి కూడా యూరిక్ యాసిడ్‌ను తగ్గించేందుకు సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీంతోపాటు ప్రతిరోజు మందార పువ్వుతో తయారుచేసిన టీని తాగడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు. ఇందులో ఉండే గుణాలు సులభంగా యూరిక్ యాసిడ్‌ను నియంత్రిస్తాయి.


(ఈ సమాచారాన్ని కేవలం నిపుణులు అందించిన సమాచారం ఆధారంగా చేసుకుని రాసిన స్టోరీ.. ఇది కాబట్టి ఈ చిట్కాలు పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణులను సంప్రదించాల్సి ఉంటుంది. దీనికి జీ తెలుగు న్యూస్ కి ఎలాంటి సంబంధం లేదు.)


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి