Hing Benefits: ఇంగువతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..? ఈ 3 సమస్యలుంటే తప్పక వాడేయండి!
Hing Benefits: భారతదేశంలోని ప్రతి వంటింట్లో ఇంగువ ఖచ్చితంగా ఉంటుంది. వంట గదిలో ఇది ఏ ఆహారాన్నైన గుమగుమ పుట్టిస్తుంది. దీన్ని తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Hing Benefits: భారతదేశంలోని ప్రతి వంటింట్లో ఇంగువ ఖచ్చితంగా ఉంటుంది. వంట గదిలో ఇది ఏ ఆహారాన్నైన గుమగుమ పుట్టిస్తుంది. దీన్ని తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది వంటకాల రుచిని పెంచడానికి ఎంతో తోడ్పడుతుంది. అయితే ఇంగువలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయని..దీనిని వంటకాలలో వేసుకోవడం వల్ల ఆరోగ్యాన్ని, రుచి రెండింటిని ఇస్తుందని నిపుణులు తెలిపారు. ఇంగువ ఆరోగ్యానికి ఎంతో మేలో మీకు తెలుసా...ఇంగువ తినడం వల్ల ఈ సమస్యల నుంచి ఉపశమనం పొంద వచ్చు..
1. కడుపు ఉబ్బర సమస్య
ప్రస్తుతం చాలా మందికి అపాన వాయువు ఓ పెద్ద సమస్యగా మారింది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఆవనూనెలో ఇంగువ పొడిని కలిపి నాభి చుట్టూ మర్దన పట్టిస్తే ఉపశమనం లభిస్తుందని వైద్య నిపుణులు తెలిపారు.
2. తలనొప్పి
మానవుడు మారుతున్న పరిస్థితుల కారణంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాడు. ఇదే తరుణంలో టెన్షన్‌కు గురవుతున్నారు. దీంతో తీవ్ర తలనొప్పికి గురవుతున్నారు.
అయితే తల నొప్పి ఉపసమనం పొందడానికి పెయిన్ కిల్లర్స్ ఉపయోగిస్తారు. సహజసిద్ధమైన ట్రీట్మెంట్ కోసం ఇంగువ గ్రైండ్ చేసి పేస్ట్ లా చేసి నుదుటిపై రాస్తే కాసేపట్లో ఉపశమనం లభిస్తుందని వైద్య నిపుణులు తెలిపారు.
3. జీర్ణక్రియ సమస్యలు
ప్రస్తుతం పెద్ద సంఖ్యలో కడుపు నొప్పి సంబంధిత సమస్యలతో బాధపడుతుంటారు. జీర్ణక్రియలో సమస్యల వల్ల, తిన్న ఆహారం జీర్ణం కాకపోవటం వల్ల జీర్ణక్రియ సమస్యలు వస్తుంటాయి. అయితే ఈ సమస్యలకు చెక్ పెట్టెందుకు ఒక గ్లాసులో గోరువెచ్చని నీటిని తీసుకుని.. అందులో ఇంగువను కలుపుకొని తాగాలి. లేదంటే గ్రైండ్ చేసిన పేస్ట్‌ను నాభి చుట్టూ మర్దన చేసుకోవాలి. దీని వల్ల జీర్ణక్రియలో సమస్యలు త్వరగా మెరుగుపడతాయని వైద్యులు తెలిపారు.
Also Read: Acharya Movie Trolls: ఆచార్య మూవీపై ట్విట్టర్ లో ఘోరమైన ట్రోలింగ్.. అసలు ఏమైంది?
Also Read: Acharya OTT Release Date: మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. 'ఆచార్య' ఓటీటీ రిలీజ్ అప్పుడే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook