Home Remedies For Cough: కేవలం 20 నిమిషాల్లో దగ్గు, జలుబు, గొంతునొప్పి మాయం..
Home Remedies For Cough, Cold, Sore Throat: మందు లేకుండా కూడా ఈ వైరస్ నుంచి బయటపడవచ్చని చాలా మంది తెలియదు! ఆయుర్వేద నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం గొంతు నొప్పిని సమర్థవంతంగా నయం చేయడానికి ఈ కింద పేర్కొన్న పలు రకాల ఔషధాలను వినియోగించాలని సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Home Remedies For Cough, Cold, Sore Throat: వాతావరణంలో మార్పుల కారణాల వల్ల గొంతు నొప్పి, దగ్గు, జలుబు రావడం సర్వసాధారణం. అయితే ప్రస్తుతం చాలా మంది ఈ సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్యల నుంచి ఎంత తక్కువ సమయంలో ఉపశమనం పొందితే అంత మంచిది. లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. అయితే ప్రస్తుతం చాలా మంది మార్కెట్ లభించే ప్రోడక్ట్‌ను వినియోగిస్తున్నారు. ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి కింద పేర్కొన్న పలు రకాల ఔషధ మూలికలు కలిగి వీటిని తీసుకోవాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
దగ్గు, జలుబు, గొంతునొప్పికి ఇంటి నివారణలు:
ఇలా పసుపు, ఉప్పునీరు పుక్కిలించి ఊమండి:
250-300 మి.లీ నీటిని తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ పసుపు, అర టేబుల్ స్పూన్ ఉప్పు వేసి 5 నిమిషాల పాటు బాగా మరిగించాలి. ఇలా తయారు చేసుకున్న నీరు కాస్త చల్లారిన తర్వాత పుక్కిలించాలి. “రోజుకు 3-4 సార్లు పుక్కిలిస్తే జలుబు నుంచి ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు.
ఉసిరి రసం:
ఉసిరి రసం దగ్గు, గొంతు నొప్పిని నయం చేయడానికి కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఉసిరి రసాన్ని 15-20 mlల్లో 1 టీస్పూన్ తేనె కలిపి రోజుకు రెండుసార్లు తాగితే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలగడమేకాకుండా పై సమస్యలు కూడా సులభంగా తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
మెంతికూర:
మధుమేహంతో బాధపడుతున్నవారు మెంతికూర ఎక్కువగా తింటూ ఉంటారు. అయితే సీజనల్ వ్యాధుల నుంచి కూడా సులభంగా ఉపశమనం పొందడానికి..1 టీస్పూన్ మెంతికూరను 250 మి.లీ నీటిలో 5 నిమిషాలు మరిగించి ఫిల్టర్ చేసి తాగాలి.
తులసి ఆకులు:
తులసి ఆకుల్లో చాలా రకాల ఔషధ మూలికలు ఉంటాయి. అయితే వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే ఆరోగ్య సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయి. ముఖ్యంగా దగ్గు, గొంతు నొప్పి నివారణకు ప్రభావవంతంగా సహాయపడుతుంది.
అల్లం పొడి:
అల్లం పొడిని ఆహారంలో తీసుకుంటే గొంతు నొప్పి నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. అయితే పడుకునే క్రమంలో ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో పొడి అల్లం పొడిని కలుకుని తాగితే శరీరంలో అనారోగ్య సమస్యలు దూరం కావడమేకాకుండా సులభంగా గొంతు సమస్యలు కూడా తగ్గుతాయి.
Also Read : KomatiReddy Rajagopal Reddy: తమ్ముడు ఓటమికి అన్న కారణామా?.. రాజ్ గోపాల్ రెడ్డి కొంపముంచిన కాంగ్రెస్
Also Read : Komatireddy Venkat Reddy: కాంగ్రెస్ నుంచి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సస్పెండ్?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook