Honey Precautions: తేనెను ఈ పదార్ధాలతో కలిపి సేవిస్తే..మొత్తం విషమైపోతుంది జాగ్రత్త
Honey precautions: ఆరోగ్యానికి తేనె దివ్యౌషధం లాంటిది. అయితే తేనెను ఎలా తీసుకోవాలో తెలుసుకోవాలి. మీరు చేసే పొరపాట్లు అదే తేనెను విషంగా మారుస్తాయి. పొరపాటున కూడా తప్పులు చేయవద్దంటున్నారు వైద్య నిపుణులు.
తేనెను సర్వ రోగ నివారిణిగా పిలుస్తారు. తేనెతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అత్యధికం. చిన్న తప్పులు చేస్తే మాత్రం అంతే విషతుల్యం కావచ్చు. కొన్ని రకాల పదార్ధాలతో కలిపి తేనె సేవించడం మంచిది కాదు.
తేనెను ప్రతిరోజూ క్రమం తప్పకుండా సేవించడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. పలు అనారోగ్య సమస్యలకు తేనె ఒక్కటే పరిష్కారం. అయితే తేనె సేవించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే పొరపాటున కూడా కొన్ని పదార్ధాల్ని తేనెతో కలిపి తీసుకోకూడదు. ఏమాత్రం జాగ్రత్త లేకపోయినా..ఒక్క స్పూన్ తేనె సైతం విషంగా మారవచ్చు. తేనెను ఎలాంటి వస్తువులతో కలిపి తినవచ్చనేది పరిశీలిద్దాం. చాలామందికి తేనె ఎలా సేవించాలి, దేనితో కలపకూడదు, దేనితో కలపవచ్చనేది తెలియదు.
1. నెయ్యి-తేనె కాంబినేషన్ మంచిది కాదు. ఆరోగ్యానికి హాని చేకూరుస్తుంది. తేనెతో కలిపి ఎట్టి పరిస్థితుల్లోనూ నెయ్యి తీసుకోకూడదు. ఆయుర్వేదంలో సైతం ఈ కాంబినేషన్ ఆరోగ్యానికి నష్టదాయకమని ఉంది. నెయ్యిలో చలవ చేసే గుణాలుంటే..తేనెలో వేడి చేసే గుణాలుంటాయి. ఈ రెండింటి పరస్పర వ్యతిరేక గుణాల కారణంగా ఆరోగ్యానికి హాని కలుగుతుంది.
2. తేనెను వేడి వేడి పాలలో కలిపి తాగకూడదు. చాలామంది ఇదే పొరపాటు చేస్తుంటారు. ఇంకొంతమంది వేడి వేడి నీళ్లలో తేనె కలిపి తాగుతుంటారు. కొంతమంది టీలో తేనె కలిపి సేవిస్తుంటారు. కానీ ఇలా చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఇలా చేయడం వల్ల తేనె తన సహజసిద్ధ గుణాల్ని కోల్పోవడమే కాకుండా..ఆరోగ్యానికి హాని కలుగుతుంది.
3. ఇక చివరిగా తేనెను ముల్లంగి, కీరాతో కలిపి తీసుకోకూడదు. లేదా ఈ రెండింటికీ తేనె జోడించకూడదు. కారణం ఒకటే. ఈ రెండూ చలవ చేసేవి కాగా తేనె వేడి చేస్తుంది. చాలామంది సలాడ్‌లో తేనె కలుపుకుని తింటుంటారు. ఇలా చేయడం వల్ల కడుపుపై ప్రభావం పడుతుంది. ఆరోగ్యం సంబంధిత సమస్యలు ఎదురౌతాయి.
Also read: Health Benefits: పాలలో ఆ పౌడర్ కలిపి తాగితే..21 రోజుల్లో ఆ సమస్యలకు చెక్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook