Diabetes and Pregnancy: ప్రెగ్నెన్సీ కోరుకునేవారికి ఇది చాలా ముఖ్యమైన విషయం. ప్రెగ్నెన్సీ మిస్‌క్యారేజ్ కాకుండా ఉండాలన్నా లేదా ప్రీమెచ్యూర్ డెలివరీ తప్పించాలనన్నా ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవల్సిందే. నిపుణులు ఏం చెబుతున్నారంటే..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డయాబెటిస్ అనేది ప్రస్తుత రోజుల్లో ఓ సర్వ సాధారణమైన సమస్య. జాగ్రత్తలు తీసుకుంటే ఎంత అదుపులో ఉంటుందో..అజాగ్రత్తగా ఉంటే అంతే ప్రమాదకరంగా మారుతుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు షుగర్ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. శరీరంలో షుగర్ లెవెల్స్ పూర్తిగా అదుపులో ఉంచుకోమంటున్నారు నిపుణులు. ప్రెగ్నెన్సీ సమయంలో ఎదురయ్యే మిస్‌క్యారేజ్ (Miscarriage), ప్రీ మెచ్యూర్ డెలివరీ (Premature Delivery)వంటివాటిని తప్పించాలంటే షుగర్ లెవెల్స్ అదుపులో ఉండాల్సిందే. షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే మిస్‌క్యారేజ్, ప్రీ మెచ్యూర్ డెలివరీ, ఫీటస్ సమస్యలు, ప్రీఎక్లాంప్సియా, డెలివరీ క్లిష్టం కావడం వంటివి ఉంటాయి.


ప్రెగ్నెన్సీ విషయంలో అయితే డయాబెటిస్ (Diabetes) అనేది పురుషుల కంటే మహిళలకే ఎక్కువ ప్రమాదకరం. శరీరంలో మెటబోలిక్ డిసార్డర్ తలెత్తడంతో వివిధ రకాల సమస్యలు ఉత్పన్నమవుతాయంటున్నారు వైద్య నిపుణులు. డయాబెటిస్ అనేది మహిళ సంపూర్ణ ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా హార్ట్ డిసీజ్, కిడ్నీ డిసీజ్(kidney Problems), అంధత్వం, డిప్రెషన్, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, ఇన్‌ఫెర్టిలిటీ వంటి సమస్యలకు దారితీస్తుంది. ప్రెగ్నెన్సీ సమయంలో డయాబెటిస్ నియంత్రణలో లేకపోతే తీవ్రమైన దుష్పరిణామాలు ఉంటాయి. డయాబెటిస్ కారణంగా తలెత్తే సమస్యల్లో తల పెద్దదిగా ఉండటం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, జాండిస్, హైపోగ్లైసీమియా వంటివి పుట్టబోయే బేబీలో కన్పించవచ్చు.


మరోవైపు ప్రెగ్నెన్సీ( Pregnancy) సమయంలో డయాబెటిస్ అనేది ఫీటల్ మాల్‌ఫార్మేషన్, లోయర్ స్పైన్, బట్టక్స్ పూర్తిగా అభివృద్ధి చెందకపోవడానికి దారి తీస్తుంది. ప్రెగ్నెన్సీ గుర్తించడానికి ముందే ఈ మాల్ ఫార్మేషన్స్ అభివృద్ధి చెందుతాయి. అందుకే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేముందే షుగర్ లెవెల్స్ అనేది పూర్తిగా కంట్రోల్‌లో ఉంచుకోవాలి. ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ నిరోధించేందుకు హార్ట్, కిడ్నీ, లివర్ పరిస్థితిని తెలుసుకునే వివిధ రకాల పరీక్షలు చేయించుకోవడం మంచిది. ఎప్పటికప్పుడు బ్లడ్ షుగర్ లెవెల్స్ పరీక్షించుకుంటూ ఉండాలి. సరైన ఆహారం తీసుకోవడం, నిర్ణీత బరువు కలిగి ఉండటం బ్లడ్ షుగర్ లెవెల్స్‌‌ను (Blood Sugar Levels) అదుపులో ఉంచుతుంది. 


అందుకే మీకొకవేళ డయాబెటిస్ ఉండి ఉంటే..తాజా పండ్లు, కూరగాయలు, తృణ ధాన్యాలు, పప్పులు, చిక్కుళ్లు వంటివి తీసుకోవాలి. వైద్యుని పర్యవేక్షణలో బరువుని ఎప్పటికప్పుడు నియత్రించుకుంటూ ఉండాలి.


Also read: Omicron symptoms: డెల్టా వేరియంట్‌తో పోల్చితే ఒమిక్రాన్ లక్షణాలు వేరు.. ప్రభావం కూడా తక్కువే!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook