Types Of Salt For Health Benefits: అహారంలో ఉపయోగించే ఉప్పును మనం పరిమాణంగా వాడటం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. కానీ ఉప్పును అధికంగా తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే మనం రోజు తినే ఉప్పు పది రకాలల్లో లభిస్తుందని పరిశోధనలో తేలింది. వీటిని మనం రోజు తీసుకొనే ఆహారం ఉపయోగించడం వల్ల ఎన్నో ఆరోగ్య లాభాలను పొందవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ పది రకాల ఉప్పులో ఏ ఉప్పు తీసుకోవడం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాం అంటే అనే ప్రశ్న ప్రతిఒక్కరిలో కలుగుతుంది. అయితే తరుచు తీసుకొనే పింక్‌ హిమాలయన్‌ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. జీర్ణవ్యవస్థతో బాధపడేవారు  బ్లాక్‌ సాల్ట్‌ తినడం వల్ల ఈ సమస్య నుంచి బయట పడవచ్చని నిపుణులు చెబుతున్నారు. మనం రోజు తీసుకొనే టేబుల్‌ సాల్ట్ శరీరానికి అయోడిన్‌ సమస్యను తగ్గిస్తుంది. ఆరోగ్యనిపుణులు ప్రకారం మనం తీసుకొనే సాల్ట్‌ తరుచు మారుస్తూ ఉండాలి అని అంటున్నారు. దీని వల్ల శరీరానికి అన్ని రకాల పోషకాలు లభిస్తాయి. వీటిని తగిన పరిమానంలో ఉపయోగించడం చాలా అవసరం.


ఉప్పులో ఎన్ని రకాలు?


కల్లు ఉప్పు: 


ఈ ఉప్పును చాలామంది పింక్‌ సాల్ట్‌ అని కూడా పిలుస్తారు. దీని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ఇది ఎక్కువగా రాళ్ల నంచి తయారు అవుతుందని వైద్యులు చెబుతున్నారు. 


టేబుల్ ఉప్పు: 


ఈ ఉప్పును మనం ప్రతిరోజు ఉపయోగిస్తాం. దీని కామన్‌ సాల్ట్‌ అని కూడా పిలుస్తారు. దీనిని తీసుకోవడం వల్ల మెదడు చురుకుగా పనిచేస్తుంది. అంతేకాకుండా గాయిటర్‌ వంటి సమస్య నుంచి కాపాడుతుందని నిపుణులు చెబుతున్నారు.


సముద్రపు ఉప్పు:


ఈ సముద్రపు ఉప్పులో అధిక శాతం జింక్‌, పొటాషియం, ఐరన్‌ వంటి గుణాలు పుష్కలంగా ఉంటాయి. దీని సముద్రపు నీటిని ఆరబెట్టిన తర్వాత తయారు చేస్తారు. 


కోషర్ ఉప్పు:


ఈ కోషర్‌ ఉప్పు అనే ఎంతో సులభంగా కరిగిపోతుంది. దనీని నాన్ వెజ్‌ ఫుడ్స్‌లో ఎక్కువగా చిలకరించడంలో ఉపయోగిస్తారు. దీని ఎక్కువగా తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడాల్సి ఉంటుంది.


సెల్టిక్  ఉప్పు: 


ఫ్రెంచ్ లో ఈ సెల్టిక్‌ ఉప్పును సెల్ గ్రీజ్ సాల్ట్ అంటారు. చేపలు, మాంసం లో ఉపయోగిస్తారు. ఇది  ప్రవాహంతో నిండిన చెరువుల నుంచి తయారు చేయబడినది.


నల్ల ఉప్పు: 


జీర్ణవ్యవస్థతో బాధపడేవారు ఈ నల్ల ఉప్పును తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి వెంటనే ఉపశమనం పొందవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.  దీనిని ఆయుర్వేదంలో కూడా ఎక్కువగా ఉపయోగిస్తారు.


Also Read Arthritis: వెల్లుల్లితో కీళ్ల, మోకాళ్ల నొప్పులకు చెక్‌..ప్రతి రోజు ఇలా చేయండి!


స్మోక్డ్ ఉప్పు:


ఈ స్మోక్డ్ ఉప్పును చాలా దేశలలో ఉపయోగిస్తారు. దీని పదిహేను రోజుల చెక్క పొగతో పొగబెట్టడం వల్ల ఈ ఉప్పు తయారు అవుతుందని చెబుతున్నారు. 


ఫ్లూర్ డి సెల్ ఉప్పు: 


ఈ ఉప్పును చాక్లెట్‌, నాన్‌ వెజ్‌, సీఫుడ్స్‌లో ఎక్కువగా ఉపయోగిస్తారు. దీని ఫ్రాన్స్‌లో ని టైడల్ బ్రిడ్జ్ నుంచి తయారు చేస్తారు.


ఫ్లేక్ ఉప్పు: 


ఈ ఉప్పు నుంచి తెలుపు రంగు ఉప్పు తయారు అవుతుంది. ఇందులోని మినరల్స్ చాలా తక్కువగా ఉంటాయి. 


బ్లాక్ హవాయి ఉప్పు: 


దీనిని బ్లాక్ లావా సాల్ట్ అని కూడా అంటారు.  ఈ ఉప్పును సముద్రం నుంచి తీసి తయారు చేస్తారు.యాక్టివేట్ బొగ్గు కారణంగా నలుపు రంగులో ఉంటుంది.    
 


Also Read Banana Tea: బనానా టీని తాగడం వల్ల ఈ సమస్యలు మాయం!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter