Best Pain Reliever For Arthritis: తరచుగా కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు రావడాన్ని వైద్య శాస్త్రంలో ఆర్థరైటిస్ అని అంటారు. ఇంతక ముందు ఈ సమస్యలు 50 లేదా 60 సంవత్సరాలు పై బడిన వారిలో వచ్చేవి. అయితే ఆధునిక జీవనశైలి కారణంగా అతి చిన్న వయసులో కూడా ఈ ఆర్థరైటిస్ సమస్యలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇలాంటి సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు ఆధునిక జీవనశైలితో పాటు ఆహారపు అలవాట్లేనని వైద్య నిపుణులు అంటున్నారు.
ఈ కీళ్ల నొప్పులతో బాధపడేవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నవారు ప్రతి రోజు ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడమే కాకుండా జీవనశైలిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆరోగ్య నిపుణులు సూచించిన కొన్ని ఇంటి చిట్కాలు కూడా పాటించాలి. ఈ సమస్యతో బాధపడేవారు ప్రతి రోజు వెల్లుల్లి పాల హోం రెమెడీ వినియోగించడం వల్ల సులభంగా ఉపశమనం పొందుతారు. అంతేకాకుండా శరీరంలోని రోగనిరోధక శక్తి మెరుగుపడి..కీళ్ల నొప్పుల నుంచి విముక్తి లభిస్తుంది.
వెల్లుల్లిని నెయ్యిలో వేయించి తీసుకోండి:
కీళ్ల నొప్పులతో బదపడుతున్నవారు ప్రతి రోజు దేశీ నెయ్యి వేడి చేసి అందులో 4 లేదా 5 వెల్లుల్లి మొగ్గలను వేయించి తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఇలా తీసుకోవడం వల్ల గుండె పని తీరు కూడా మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే ఔషధ గుణాలు గౌట్, దగ్గు, జలుబు వంటి సమస్యల నుంచి కూడా విముక్తి కలిగిస్తుంది. దీంతో పాటు ఆర్థరైటిస్ నొప్పులను సులభంగా తగ్గిస్తుంది. ఇలా నెయ్యిలో వేయించి తీసుకుంటే వెల్లుల్లి వాసన కూడా ఉండదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
వెల్లుల్లి వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు:
కిడ్నీ ఇన్ఫెక్షన్స్ నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది.
రక్తంలోని చక్కెర పరిమాణాలు కూడా నియంత్రణలో ఉంటాయి.
గుండె పని కూడా మెరుగు పడుతుంది.
క్యాన్సర్ కణాలను కూడా సులభంగా నిరోధిస్తుంది.
జలుబు, జ్వరం ఇతర సమస్యలు కూడా దూరమవుతాయి.
Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter